Raadya : రెడ్ బ్యాగ్ తో ఎంట్రీ ఇస్తున్న రాధ్య..

ఓ రెడ్ బ్యాగ్ చుట్టూ తిరిగే ఆసక్తికర థ్రిల్లింగ్ కథనంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. (Raadya)

  • Published on- May 29, 2026 / 07:12 PM IST

Raadya

Raadya : మెమరీ మేకర్స్ బ్యానర్ పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రవి కుమార్ సీరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రెడ్ బ్యాగ్’. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి.. పలువురు కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఓ రెడ్ బ్యాగ్ చుట్టూ తిరిగే ఆసక్తికర థ్రిల్లింగ్ కథనంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్స్ రిలీజ్ అవ్వగా తాజాగా ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్న కన్నడ భామ రాధ్య ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.

Also Read : Sanjay Rao : బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావ్ కొత్త సినిమా అనౌన్స్.. హిట్ అండ్ రన్ అంటూ..

ఈ పోస్టర్ లో హీరోయిన్ రాధ్య గన్ పట్టుకొని మరో చేతిలో బీరీఫ్ కేసు పెట్టుకొని పవర్ ఫుల్ గా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.