Ritika Singh : ఆ హీరోయిన్ చేతికి గాయాలు.. బ్రేక్ తీసుకుంటున్నా అంటూ పోస్టు
బాక్సర్ టర్న్డ్ యాక్ట్రెస్ రితికా సింగ్ చేతికి గాయాలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమెకు ఏమైంది?
- Lakshmi 10tv
- Updated on- December 5, 2023 / 01:08 PM IST
Ritika Singh
Ritika Singh : నటి రితికా సింగ్ చేతికి గాయాలున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తలైవర్ 170 సెట్లో ఆమె గాయపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది?
Jeevitha Rajashekar : మా ఆయన, నా కూతుళ్లే సర్వస్వం.. వాళ్ళ కోసం ఎవరితో ఎంత పెద్ద ఫైట్ అయినా చేస్తా..
నటి రితికా సింగ్ చేతికి గాయాలైన ఫోటోతో పాటు తన చేతికి గాయాలవడం వల్ల అప్ సెట్ అవుతున్నా అంటూ రితికా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో రితిక ఏ సినిమా షూటింగ్లో అనేది క్లారిటీ ఇవ్వనప్పటికీ దర్శకుడు TJ జ్ఞానవేల్ డైరెక్షన్లో రజనీకాంత్ నటిస్తున్న ‘తలైవర్ 170’ సినిమాకు సంబంధించిన షూటింగ్ సెట్గా అందరూ భావిస్తున్నారు. పగిలిన గాజు పెంకుల కారణంగా ఆమె చేతికి గాయమైనట్లు రితికా వీడియోలో చెప్పింది.
ShadowWit అనే ట్విట్టర్ యూజర్ నుండి షేర్ చేయబడిన వీడియోలో ‘నేను చాలా అప్ సెట్ అయ్యాను.. అక్కడ గ్లాస్ ఉంది.. జాగ్రత్త అని నాకు చెబుతూనే ఉన్నారు.. కానీ ఒక్కోసారి అలా జరిగిపోతుంది. కొన్ని పరిస్థితులను ఆపలేం.. కొన్ని సందర్భాల్లో నియంత్రణ కోల్పోతాం.. ప్రస్తుతానికి ఎటువంటి పెయిన్ లేదు.. చర్మం లోపలికి గాయం అయ్యింది.. సెట్ నుండి హాస్పిటల్కి వెళ్తున్నాను..’ అంటూ రితికా ఆ వీడియోలో చెప్పారు.
స్వతహాగా కిక్ బాక్సర్ అయిన రితిక నటిగా మారారు. 2016 లో మాధవన్కి జోడిగా ‘ఇరుదచుట్రు’ సినిమాలో నటించారు. ఈ సినిమా హిందీలో ‘సాలా ఖండూస్’ పేరుతో విడుదలైంది. ఆ సినిమానే తెలుగులో వెంకటేష్ తో ‘గురు’గా రీమేక్ చేశారు. ఈ సినిమాలో రామేశ్వరి పాత్రలో రితిక అందర్నీ అలరించారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిన రితిక రీసెంట్గా రజనీకాంత్ సినిమా ‘తలైవర్ 170’ (వర్కింగ్ టైటిల్) లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రితికా చేతికి గాయాలయ్యాయి.
