Samantha: ముంబైకి వెళ్లేదే లేదు.. హైదరాబాద్ నాకు చాలా ఇచ్చింది – సమంత

బాలీవుడ్ ఆఫర్ వచ్చినంత మాత్రాన మకాం మార్చేసి ముంబైకి వెళ్లిపోవాలనుకోవడం లేదదంటోంది సమంతా. ఫ్యామిలీ మ్యాన్ సీజన్-2తో దేశవ్యాప్తంగా గుర్తింపు..

Samantha

Samantha: బాలీవుడ్ ఆఫర్ వచ్చినంత మాత్రాన మకాం మార్చేసి ముంబైకి వెళ్లిపోవాలనుకోవడం లేదదంటోంది సమంతా. ఫ్యామిలీ మ్యాన్ సీజన్-2తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శామ్.. డిఫరెంట్స్ రోల్స్ చేయాలని, దానికి తానెప్పుడూ సిద్ధమే అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ క్రేజ్ ను బాలీవుడ్ ఆఫర్లకు చక్కగా వాడుకోవాలనుకుంటుందట.

కొత్తగా ప్లానింగ్ చేయకుండా.. టాలీవుడ్ పద్ధతినే అక్కడ కూడా ఫాలో అయిపోవాలని ప్లాన్ చేసింది. మహిళా కమాండో పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం, వచ్చింది. ఇప్పుడు అదే క్రేజ్ తో బాలీవుడ్ ఆఫర్లు పలకరిస్తుండటంతో ఓకే చెప్పాయాలని అనుకుంటున్నారు.

‘వెబ్ సిరీస్ రూపంలో బాలీవుడ్ చాలా పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నా. వెబ్ సిరీస్ ఇచ్చిన ఉత్సాహంతో అన్ని భాషల్లో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నా. బాలీవుడ్ లో నటించడం మాత్రమే ప్రాధాన్యం కాదు, ఏ భాషలో అయినా మంచి స్క్రిప్ట్ ను వెదికి పట్టుకుంటా. ఏ నిర్ణయమైనా మనస్ఫూర్తిగా తీసుకుంటా’ ఇలా బాలీవుడ్ ఆఫర్లపై సమంతా స్పందించారు.

‘హైదరాబాద్ నాకు చాలా ఇచ్చింది. ఇప్పటికిప్పుడు ముంబైలో మకాం పెట్టాలనే ప్లాన్ లేదు. ఎక్కడున్నాం అనేది ముఖ్యం కాదు, ఇంతకుముందు చేయని పాత్రలు పోషించామా లేదా అనేది ముఖ్యం. చేసిన రోల్స్ మళ్లీ మళ్లీ చేస్తే ఆడియన్స్ కు కూడా బోర్ కొట్టేస్తుంది’ అంటున్నారు సమంత.