వావ్.. సంయుక్తా హెగ్డే జిమ్నాస్టిక్స్..

  • Publish Date - September 19, 2020 / 01:14 PM IST

Samyuktha Hegde tries her hand at gymnastics: లాక్‌డౌన్ కారణంగా గత ఐదు నెలలుగా సినిమా షూటింగులు నిలిచిపోయాయి.. దీంతో సెలబ్రిటీలకు బోలెడంత ఖాళీ సమయం దొరికింది. ఫిట్ నెస్, కుకింగ్ ఇలా ఇష్టమైన పనులు నచ్చిన పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు స్టార్స్..


తాజాగా కన్నడ నటి సంయుక్తా హెగ్డే జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. ట్రైనర్ సాయంతో గాల్లో ఎగురి పరుపుపై దూకుతూ ఫీట్స్ చేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయగా నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.
స్వతాహా ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన సంయుక్త రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేస్తుంటుంది.


ఇటీవల బెంగ‌ళూరులోని ఓ పార్కులో వ‌ర్క‌ౌట్స్ చేస్తుండగా.. పబ్లిక్ ప్లేసులో ఇలా స్పోర్ట్స్ బ్రా వేసుకుని జాగింగ్ చేస్తావా అంటూ ఆమెపై కొందరు దాడి చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో నాగార్జున‌తో ‘మ‌న్మ‌థుడు 2’, నిఖిల్‌తో ‘కిర్రాక్ పార్టీ’ వంటి చిత్రాల్లో నటించింది సంయుక్తా హెగ్డే.