Actress Shriya Saran Flaunts Baby Bump In Throwback Video
Shriya Baby Bump : ఇప్పుడంతా బేబీ బంప్ ట్రెండ్ నడుస్తోంది. పెళ్లి అయిన తర్వాత చాలామంది హీరోయిన్లు తమ మాతృత్వ అనుభూతులను ఆశ్వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూనే వ్యక్తిగత ఫొటోలను షేర్ చేస్తున్నారు. మొన్నటివరకూ బేబీ బంప్‌తో నెట్టింట్లో రచ్చ చేసిన కాజల్ అగర్వాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు అదే తరహాలో మరో హీరోయిన్ శ్రియా సరన్ కూడా బేబీ బంప్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అప్పట్లో బడా హీరోలతో నటించిన శ్రియ ఓ వెలుగు వెలిగిపోయింది. ఇష్టం మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. అతికొద్దికాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ బడా హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రభాస్, తరుణ్ ఇలా చాలామంది హీరోలతో శ్రియ నటించింది. బాలయ్య బాబుతో అప్పట్లో చిన్నకేశవ రెడ్డితో మంచి హిట్ జోడీగా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణిలో శ్రియా నటించింది. పెళ్లి అయిన తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన శ్రియా.. ఇటీవల రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీలోనూ కనిపించింది.
Actress Shriya Saran Flaunts Baby Bump In Throwback Video
2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చవ్‌ను సీక్రెట్ గా పెళ్లాడింది. ప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసింది. తాను ప్రెగ్నెంట్ అయిన విషయం కూడా చాలా రహస్యంగా ఉంచింది. గత ఏడాది అక్టోబర్‌లో కూతురు పుట్టిన విషయాన్ని ప్రకటించి సడన్ షాక్ ఇచ్చింది శ్రియా.. యా ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది.
తన రొమాంటిక్ ఫొటోలను ఎప్పటికప్పుడూ తన ఇన్ స్టాలో పోస్టు చేస్తుంది. కొన్నిరోజులుగా శ్రియా బేబీ బంప్ తో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియో ఇప్పటిది కానే కాదు.. అది పాత వీడియో.. 2020లో బేబీ బంప్‌తో డ్యాన్స్ చేసిన వీడియో అది.. మొదటి లాక్ డౌన్ సమయంలో తాను గ్నెంట్ అయిన విషయాన్ని తన అభిమానులకు షేర్ చేసింది.
Read Also : Andrei Koscheev : శ్రియ భర్తకి సర్జరీ.. పాపని కూడా ఎత్తుకోలేకపోయాడు అంటూ ఎమోషనల్ పోస్ట్..