Soniya Singh : రెండు నెలల్లోనే.. మరో ఖరీదైన కొత్త కార్ కొన్న నటి సోనియా సింగ్.. ఎన్ని కోట్లు తెలుసా?

సోనియా సింగ్ తాజాగా ఓ కొత్త కార్ ని కొనుక్కుంది.

Actress Soniya Singh Buys New Costly Benz Car

Soniya Singh : యూట్యూబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమ్ తెచ్చుకున్న సోనియా సింగ్ ఇప్పుడు సినిమాలు, సిరీస్ లలో క్యారెక్టర్స్ చేస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. సిద్దు పవన్ అనే మరో నటుడితో ప్రేమలో ఉంది సోనియా. వీరిద్దరూ లివింగ్ టు గెదర్ లో ఉన్నారని టాక్.

సోనియా సింగ్ తాజాగా ఓ కొత్త కార్ ని కొనుక్కుంది. హైదరాబాద్ లో ఓ టెంపుల్ దగ్గర తన కొత్త కార్ కి పూజలు చేయించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ కార్ బెంజ్ ఫోర్ మ్యాటిక్ అని తెలుస్తుంది. దీని ధర దాదాపు 1.39 కోట్ల నుంచి 1.50 కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం. అంటే ఆల్మోస్ట్ కోటిన్నర పెట్టి సోనియా కార్ కొందా అని ఆశ్చర్యపోతున్నారు.

Also Read : Sivaji Raja : అప్పటి క్రికెటర్ మాజీ భార్యని లవ్ చేసిన శివాజీ రాజా.. ఎవరో తెలుసా? వన్ సైడ్ లవ్ స్టోరీ భలే ఉందే..

ఓ రెండు నెలల క్రితం సోనియా బెంజ్ కంపెనీకి చెందిన కార్ కొనుక్కొని అప్పుడు కూడా ఇలాగే పూజ చేయించిన ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు మరోసారి కొత్త కార్ ఫొటోలు షేర్ చేసి.. దేవుడి ప్లాన్ ఎప్పుడూ బెస్ట్ గానే ఉంటుంది. ప్రయాణం కష్టంగా ఉన్నా దేవుడ్ని మర్చిపోవద్దు. మన కోసం ఏదైనా గొప్పగా చేస్తున్నాడు అని ఎదురుచూడాలి అంటూ పోస్ట్ చేసింది.

దీంతో ఇంత కాస్ట్లీ కార్ సోనియా ఎలా కొనుక్కుంది? సోనియా అంత సంపాదిస్తుందా అని కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read : Ram Charan Wax Statue : రామ్ చరణ్ మైనపు విగ్రహంతో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు చూశారా?