Tamannaah Bhatia : టైలర్‌గా మారిన తమన్నా..

మిల్కీ బ్యూటీ తమన్నా.. ఓ పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ మనవరాలైన బేబి మరియా కొలతలు తీసుకుంటూ సందడి చేసింది..

Tamannaah Bhatia

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా టైలర్‌గా మారింది. ఓ చిన్న పాపకు టేపుతో కొలతలు తీసుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటీవల గోపిచంద్ పక్కన కథానాయికగా.. వుమెన్ కబడ్డీ టీం కోచ్ జ్వాలా రెడ్డి క్యారెక్టర్‌లో ఆకట్టుకుంది తమన్నా.

Tamannaah : నిర్మాతలకు సారీ చెప్పిన తమన్నా..

పాండమిక్ తర్వాత థియేటర్లలో రిలీజ్ అయిన ‘సీటీమార్’ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే నితిన్ ‘మ్యాస్ట్రో’ సినిమాలో నెగెటివ్ రోల్‌లో కనిపించి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. హిందీ ‘అంధాధూన్’ లో టబు చేసిన రోల్ తను చేసి మంచి అప్లాజ్ అందుకుందీ మిల్కీ బ్యూటీ.

Tamannaah: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తగ్గేది లేదంటున్న తమన్నా!

ఇక రీసెంట్‌గా తమన్నా షేర్ చేసిన వీడియో విషయానికొస్తే.. పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా కుమార్తె నిష్కా లుల్లా గారాల పట్టీ బేబి మిరయాకు డ్రెస్ కుడుతున్నానంటూ.. ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్‌లా మారిపోయి సరదాగా టేపుతో కొలతలు తీసుకుంది తమన్నా. బేబి మిరయా ఏమీ అర్థం కానట్టు అలా క్యూట్‌గా చూస్తూ ఉండిపోయింది. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.