Adah Sharma : ఆ హీరో సూసైడ్ చేసుకున్న ప్లాట్‌ను కొన్న అదాశర్మ..? క్లారిటీ ఇదే..!
హార్ట్ ఎటాక్ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన చిన్నది అదా శర్మ. మొదటి చిత్రంతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో రాణిస్తోంది. ఇటీవలే ది కేరళ స్టోరీ చిత్రంతో మంచి సక్సెస్‌ను అందుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : August 28, 2023 / 04:34 PM IST
Sushant Singh Rajput-Adah Sharma
Adah Sharma : హార్ట్ ఎటాక్ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన చిన్నది అదా శర్మ. మొదటి చిత్రంతోనే యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో రాణిస్తోంది. ఇటీవలే ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో మంచి సక్సెస్‌ను అందుకుంది. కేరళలో జరిగిన అమ్మాయిల మిస్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది. తాజాగా అమ్మడికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న ప్లాట్‌ను అదా శర్మ కొనుగోలు చేసిందనే న్యూస్ వైరల్‌గా మారగా దీనిపై ఆమె స్పందించింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన కెరీర్ మంచి పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ముంబై బాంద్రాలోని ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉండేవాడు. సముద్రానికి ఎదురుగా ఉన్న ఈ ప్లాట్‌కు అతడు నెలకు దాదాపు రూ.4.5లక్షలు అద్దె చెల్లించేవాడు. అయితే.. 2020 జూన్ 14న తాను నివసిస్తున్న ప్లాట్‌లోనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మరణం అందరిని షాక్‌కు గురి చేసింది. ఆయన ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు అన్న సంగతి ఇంత వరకు తెలియరాలేదు.
Jason Sanjay : దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్న తమిళ్ హీరో విజయ్ తనయుడు..
సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న తరువాత ఆ ప్లాట్‌లో అద్దెకు ఉండేందుకు ఎవరూ ముందుకు రాలేదట. కొందరు ఆ ప్లాట్‌ను కొనేందుకు ముందుకు వచ్చినా.. ఆ ఇంటి యజమాని మాత్రం అద్దెకు ఇచ్చేందుకు మాత్రమే ఇష్టపడుతున్నట్లు అక్కడి రియల్ ఎస్టేట్ ఏజెంట్ తెలిపారు. ఆ ఇంటిని అదా శర్మ కొనుగోలు చేసినట్లు కొన్ని రోజులుగా బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అదాశర్మ ఎట్టకేలకు మౌనం వీడింది.
Allu Arjun : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసిన అల్లు అర్జున్..
మీడియా దీని గురించి అదా ముందు ప్రస్తావించగా అలాందిటి ఏదైన ఉంటే తానే ముందుగా చెబుతానని చెప్పింది. మీకు ప్రామిస్ చేస్తున్నా అలాంటిది ఏదైన ఉంటే మీ అందరి నోళ్లను తీపి చేస్తా అంటూ అదా తెలిపింది.
