Prathinidhi 2 : 16,32,96,000 సెకన్ల తరువాత కెమెరా ముందుకు నారా రోహిత్.. ప్రతినిధి 2 షూటింగ్ మొదలు..
నారా రోహిత్ (Nara Rohit) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాణం సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో సోలోతో భారీ సక్సెస్‌ను అందుకున్నాడు.
Prathinidhi 2 shoot begins : నారా రోహిత్ (Nara Rohit) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.’బాణం’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ‘సోలో’తో భారీ సక్సెస్‌ను అందుకున్నాడు. ఆ తరువాత ‘ప్రతినిధి’, ‘రౌడీ ఫెలో’, ‘అసుర’ వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేశాడు. 2018లో ‘వీర భోగ వసంత రాయలు’ సినిమా తరువాత ఎందుకనో మరో సినిమా చేయలేదు. దీంతో అందరూ ఈ హీరో సినిమాలకు గుడ్ బై చెప్పాడు అని అనుకుంటుంగా ఇటీవలే తన కొత్త సినిమా గురించి ఓ అప్డేట్ ఇచ్చాడు.
Jason Sanjay : దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్న తమిళ్ హీరో విజయ్ తనయుడు..
తన కెరీర్లో మంచి విజయం అందుకున్న ప్రతినిధి చిత్రానికి సీక్వెల్‌గా ‘ప్రతినిధి 2’తో వస్తున్నట్లు చెప్పాడు. అంతేనా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా ఆకట్టుకుంది. ఇక తాజాగా నేటి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేసింది. ఇక నారా రోహిత్ తన సోషల్ మీడియాలో 16,32,96,000 సెకన్ల తరువాత కెమెరా ముందుకు వచ్చినట్లు చెబుతూ ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్‌గా మారింది.
Kangana Ranaut : ‘చంద్రముఖి’గా కంగనా ‘నవరసాల’ ప్రదర్శన చూశారా..?
ప్రతినిధి 1 చిత్రాన్ని ప్రశాంత్ మండవ డైరెక్ట్ చేయగా ప్రతినిధి 2కి మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహిస్తున్నారు. కుమార్‌రాజా బాతులా, ఆంజనేయులు శ్రీతోట, కొండకల్లా రాజేందర్ రెడ్డి వానరా ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా 2024 జనవరి 25న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు రానుంది.
16,32,96,000 seconds
BACK ON TRACK #Pratinidhi2 pic.twitter.com/77EZ47Kmmv— Rohith Nara (@IamRohithNara) August 28, 2023
Naveen Polishetty : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రచారంలో నవీన్ తో కలిసి కేఏ పాల్..