Kangana Ranaut : ‘చంద్రముఖి’గా కంగనా ‘నవరసాల’ ప్రదర్శన చూశారా..?

'చంద్రముఖి-2' చిత్రంలో కంగనా రనౌత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక సీన్ ని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కంగనా నవరసాలు..

Kangana Ranaut : ‘చంద్రముఖి’గా కంగనా ‘నవరసాల’ ప్రదర్శన చూశారా..?

Kangana Ranaut Navarasa acting in Raghava Lawrence Chandramukhi 2

Updated On : August 28, 2023 / 2:53 PM IST

Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం ‘చంద్రముఖి-2’ (Chandramukhi 2) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ఈ సీక్వెల్ లో హీరోగా నటిస్తున్నాడు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.

Ira Khan Nupur Shikhare : పెళ్ళికి ముందే రిసార్ట్‌లో ఎంజాయ్ చేస్తున్న ఐరా ఖాన్ – నుపుర్ శిఖర్

అలాగే మరోపక్క ప్రమోషన్స్ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల తమిళంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా నిర్వహించారు. తాజాగా మూవీలోని ఒక సీన్ ని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కంగనా నవరసాలు పలికిస్తూ కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. మరి కంగనా నవరసాలు ఎలా చేసిందో ఒకసారి మీరు కూడా చూసి చెప్పండి.

NTR 100 Rupees Coin Release: ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఇక మూవీ విషయానికి వస్తే.. పార్ట్ 1లో రజినీకాంత్ హీరోగా నటించగా జ్యోతిక చంద్రముఖిగా కనిపించింది. ఇప్పుడు సీక్వెల్ ని డైరెక్ట్ చేసిన పి వాసునే రజిని మూవీని కూడా డైరెక్ట్ చేశాడు. ఆ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ అంటే ఆడియన్స్ లో ఓ రేంజ్ అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోవడంలో ఏమాత్రం కొంచెం తగ్గినా సినిమా రిజల్ట్ తారుమారు అయ్యిపోతుంది.

గతంలో విక్టరీ వెంకటేష్ నటించిన ‘నాగవల్లి’ మూవీ చంద్రముఖికి సీక్వెల్ అని చెప్పే ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. కానీ ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. ఇప్పుడు రాఘవ లారెన్స్ ఎలాంటి రిజల్ట్ ని చూస్తాడో చూడాలి. కాగా రాఘవ లారెన్స్ కి హారర్ సినిమాల్లో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది. దీంతో ప్రేక్షకుల్లో ఈ మూవీ పై కొంత నమ్మకం ఏర్పడింది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.