Naveen Polishetty : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రచారంలో నవీన్ తో కలిసి కేఏ పాల్..
స్తుతం నవీన్ వైజాగ్(Vizag) లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. నిన్న సాయంత్రం నవీన్ RK బీచ్ రోడ్(Beach Road) లో వెళ్తుండగా కేఏ పాల్ కూడా అదే సమయంలో RK బీచ్ రోడ్ లో ప్రజలకు అభివాదం చేస్తున్నారు.

Naveen Polishetty Met KA Paul in Miss Shetty Mr Polishetty Promotions at Vizag
Naveen Polishetty : నవీన్ పోలిశెట్టి అనుష్క(Anushka)తో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) సినిమాతో రాబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజయి సినిమాపై ఆసక్తి పెంచింది. అనుష్క చాలా గ్యాప్ తర్వాత రాబోతుండటంతో స్వీటీ ఫ్యాన్స్ అంతా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
నవీన్ పోలిశెట్టి తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలు తిరిగేస్తూ ఫుల్ గా ప్రమోషన్స్ చేసేస్తున్నారు. ప్రస్తుతం నవీన్ వైజాగ్(Vizag) లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. నిన్న సాయంత్రం నవీన్ RK బీచ్ రోడ్(Beach Road) లో వెళ్తుండగా కేఏ పాల్ కూడా అదే సమయంలో RK బీచ్ రోడ్ లో ప్రజలకు అభివాదం చేస్తున్నారు. దీంతో నవీన్ తన కారుని ఆపి కారు పైన డెక్ తీసి బయటకు వచ్చి కేఏ పాల్(KA Paul) ని పలకరించారు. ఒకరికొకరు హాయ్ చెప్పుకొని ప్రజలకు కలిసి అభివాదం చేశారు. అనంతరం నవీన్ వెళ్ళిపోయాడు.
OG First Look : పవన్ అభిమానులకు నిరాశ.. OG ఫస్ట్ లుక్ లేదు.. కానీ..
ప్రస్తుతం నవీన్ కేఏ పాల్ ఇద్దరూ కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా చిత్రయూనిట్ దీన్ని కూడా సరదాగా ప్రమోషన్స్ కి వాడేస్తుంది. నవీన్ ఫుల్ జోష్ లో, చాలా యాక్టివ్ గా సినిమా ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న కేఏ పాల్ తో నవీన్ పలకరించడంతో ఈ వీడియో కూడా ప్రమోషన్ చేస్తూ వైరల్ అవుతున్నారు.
Mr Polishetty Timing Mathram perfect ga untadi ??
?? ???? ? ?????? ?????????? ?? on RK beach vizag #MissShettyMrPolishetty#MSMPonSep7th@NaveenPolishety @KAPaulOfficial pic.twitter.com/RS2KErbEGd
— GSK Media (@GskMedia_PR) August 28, 2023