Virosh : ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. నేడే విజయ్ రష్మిక పెళ్లి.. ఉదయ్ పూర్ లో సందడి.. పెళ్లి ఫోటోల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. (Virosh)
Virosh
- నేడే విజయ్ రష్మిక పెళ్లి
- ఉదయ్ పూర్ లో సందడి
- వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
- పెళ్లి ఫోటోల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Virosh : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి నేడు ఘనంగా జరగనుంది. గీత గోవిందం సినిమాతో పరిచయం ఏర్పడి ఫ్రెండ్స్ గా మారి డియర్ కామ్రేడ్ సమయం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. నేడు ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ITC ప్యాలెస్ లో విజయ్ – రష్మిక పెళ్లి జరగనుంది.
పెళ్లి కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య జరగనున్నట్టు సమాచారం. మూడు రోజుల ముందే విజయ్ – రష్మిక, కుటుంబసభ్యులు, పలువురు సెలబ్రిటీలు ఉదయ్ పూర్ కి వెళ్లారు. ఆల్రెడీ నిన్న ఉదయం హల్దీ వేడుకలు, నిన్న రాత్రి సంగీత్ వేడుకలు జరిగాయి. నేడు ఉదయం తెలుగు సాంప్రదాయంలో పెళ్లి జరగనుంది. సాయంత్రం కొడవ సాంప్రదాయంలో మరోసారి పెళ్లి జరగనుంది.
Also Read : Rajamouli : ఇక హాలీవుడ్ కి వెళ్ళక్కర్లేదు.. ‘వారణాసి’ ఇక్కడే నాగార్జున స్టూడియోలో షూట్.. రాజమౌళి కామెంట్స్..
ఇప్పటివరకు ఒక్క ఫోటో కూడా రాకపోయినా లీకుల ద్వారా హోటల్ లో డెకరేషన్స్, అరేజ్మెంట్స్ ఫోటోలు మాత్రం బయటకు వచ్చాయి. అలాగే వీరి పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా పెళ్లి వేడుకవద్దకు ఫోన్స్ ని అనుమతించట్లేదని సమాచారం. ఫ్యాన్స్ ఈ జంట పెళ్లి ఫోటోల కోసం ఎదురుచూస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ, తరుణ్ భాస్కర్, ఈశారెబ్బ, శ్రావ్య వర్మ.. ఇలా పలువురు సెలబ్రిటీలు ఈ పెళ్ళికి హాజరయ్యారు.
ఎన్నో ఏళ్లుగా సైలెంట్ గా ప్రేమించుకున్న ఈ జంట ఇప్పుడు ఘనంగా పెళ్లి చేసుకోబోతుండటంతో ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక పెళ్లి తర్వాత రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్ బంజార్‌హిల్స్‌లోని తాజ్‌కృష్ణలో గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కానున్నారు.
Also Read : Shivam Dube : మహేష్ బాబు పై టీమ్ ఇండియా ఆల్ రౌండర్ ఆసక్తికర కామెంట్స్.. ఏమన్నాడంటే..
