Shivam Dube : మహేష్ బాబు పై టీమ్ ఇండియా ఆల్ రౌండర్ ఆసక్తికర కామెంట్స్.. ఏమన్నాడంటే..
టీమ్ ఇండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే మహేష్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Shivam Dube)
Shivam Dube
- శివమ్ దూబే ఇంటర్వ్యూ
- మహేష్ బాబుపై కామెంట్స్
- అల్లు అర్జున్ పై కూడా
Shivam Dube : మన టాలీవుడ్ హీరోలు తెలుగు రాష్ట్రాలే కాక దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొంతమంది అయితే విదేశాల్లో కూడా ఫ్యాన్స్, మార్కెట్ సంపాదించుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబు వంతు. రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ హీరో అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మహేష్. మహేష్ ఎంత ఏజ్ పెరిగినా అదే లుక్స్ మెయింటైన్ చేస్తూ ఫ్యాన్స్ ని మెప్పిస్తాడు.
ఇటీవల టీమ్ ఇండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే మహేష్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో ఆడుతున్నాడు శివమ్ దూబే.
Also Read : Shanmukh Jaswanth : కాబోయే భార్యతో డ్యాన్సలేసి.. నిశ్చితార్థంలో రచ్చ చేసిన షణ్ముఖ్ జస్వంత్.. వీడియో వైరల్..
శివమ్ దూబే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాల ప్రస్తావన రాగా.. నేను టాలీవుడ్ సినిమాలు కూడా చూస్తాను. హిందీ డబ్బింగ్ లో తెలుగు సినిమాలు చూస్తాను. మహేష్ బాబు అంటే ఇష్టం. ఆయన స్టైల్ బాగుంటుంది. క్లాస్ గా, హ్యాండ్సమ్ గా ఉంటారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కూడా బాగుంటుంది. అలాగే అల్లు అర్జున్ డ్యాన్స్ బాగుంటుంది. పుష్ప సినిమా చూసాను అని అన్నారు. దీంతో శివమ్ దూబే కామెంట్స్ ని మహేష్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
