Adavi Shesh : ‘మేజర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్ బరిలో
ఇప్పటికే ఫిబ్రవరి ఆఖరి వారం నుంచి సమ్మర్ బరిలో పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కి రెడీ అయ్యాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు చిత్ర నిర్మాతలు. మేజర్ సినిమాని సమ్మర్.......
- Saketh U
- Updated on- February 4, 2022 / 11:22 AM IST
Major
Adavi Shesh : 26/11 ఉగ్రదాడుల సమయంలో ముంబైని రక్షించడంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిలో దివంగత మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఒకరు. మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడవి శేష్ హీరోగా ‘మేజర్’ అనే బయోపిక్ తీస్తున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ హీరో అడవి శేష్ బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాకి మహేష్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.
ఇప్పటికే ఫిబ్రవరి ఆఖరి వారం నుంచి సమ్మర్ బరిలో పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కి రెడీ అయ్యాయి. పెద్ద సినిమాలతో పాటు వాటి గ్యాప్స్ లో చిన్న సినిమాలు కూడా రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేశాయి. అడవి శేష్ మొదటి సారి బాలీవుడ్ లో ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తుండటంతో కరెక్ట్ డేట్ ని ఫిక్స్ చేయాలని ఇన్నాళ్లు వెయిట్ చేశారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు చిత్ర నిర్మాతలు.
Jacqueline Fernandez : ఈ కేసుతో ఆమెకు సంబంధం లేదు.. బాలీవుడ్ భామపై సుకేష్ వ్యాఖ్యలు..
మేజర్ సినిమాని సమ్మర్ లో మే 27న రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమాని ప్రస్తుతం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. దేశభక్తి, ప్రేమ అంశాలు కలిపి వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేశారు.
