Jacqueline Fernandez : ఈ కేసుతో ఆమెకు సంబంధం లేదు.. బాలీవుడ్ భామపై సుకేష్ వ్యాఖ్యలు..

ఇటీవల 200 కోట్ల మనీ లాండరింగ్​ కేసులో వ్యాపార వేత్త సుకేష్‌ చంద్రశేఖర్‌ విచారణ ఎదుర్కొంటూ జైలుకి వెళ్లారు. ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు. సుఖేష్‌కి బాలీవుడ్​ బ్యూటీ.......

Jacqueline Fernandez :  ఈ కేసుతో ఆమెకు సంబంధం లేదు.. బాలీవుడ్ భామపై సుకేష్ వ్యాఖ్యలు..

Jacquelin

Updated On : February 4, 2022 / 10:36 AM IST

Jacqueline Fernandez :   ఇటీవల 200 కోట్ల మనీ లాండరింగ్​ కేసులో వ్యాపార వేత్త సుకేష్‌ చంద్రశేఖర్‌ విచారణ ఎదుర్కొంటూ జైలుకి వెళ్లారు. ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు. సుఖేష్‌కి బాలీవుడ్​ బ్యూటీ, శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో సంబంధం ఉన్నట్లు వార్తలు రావడం, వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనడం, వారు సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్​ కావడంతో ఈ బాలీవుడ్ భామ కూడా చిక్కుల్లో పడింది.

 

పోలీసులు ఈమెని కూడా విచారించారు. సుఖేష్ ఈమెకి, జాక్వెలిన్ కుటుంబానికి భారీగా బహుమతులు ఇచ్చినట్లు వెల్లడైంది. వీరి ఫోటోలు బయటకి రావడంతో తన వ్యక్తిగత ఫొటోలను ప్రసారం చేయొద్దని జాక్వెలిన్ మీడియాకి, సోషల్ మీడియాకి రిక్వెస్ట్​ కూడా చేసింది. అయితే తాజాగా జాక్వెలిన్​కు మద్దతుగా నిలిచాడు సుకేష్​ చంద్రశేఖర్. ఆమెను తప్పుపట్టొద్దు అంటూ తన లాయర్​తో ఓ ప్రకటన విడుదల చేశాడు.

Nora Fatehi : సింహాలతో ఫొటోకి ఫోజులిచ్చిన ఐటెం సాంగ్స్ భామ

ఇటీవల సుఖేష్ ని కలిసిన అతని లాయర్ బయటి పరిస్థితుల గురించి చెప్పటంతో జాక్వెలిన్ పై తన లాయర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేయించాడు. ఈ ప్రకటనలో.. ”సోషల్​ మీడియాలో వైరల్​ అయిన ఫొటోల గురించి నాకు ఇటీవలే తెలిసింది. ఆమెను చెడుగా చిత్రీకరించవద్దు. ఆ ఫొటోలు రావడం దురదృష్టకరం. ఒక వ్యక్తి ప్రైవేసీకి భంగం కలిగించారు. నేను, జాక్వెలిన్ రిలేషన్​షిప్​లో ఉన్నామని గతంలోనే చెప్పాను. మేం స్వప్రయోజనాల కోసం డేటింగ్​ చేశామని అనుకుంటున్నారు. కానీ, అది నిజం కాదు.​ ప్రేమతో మాత్రమే మా బంధాన్ని కొనసాగించాం. ఆమెను చెడుగా చిత్రీకరించడం మానుకోండి. నేను జాక్వెలిన్​కు, ఆమె కుటుంబానికి ఇచ్చిన బహుమతులు, చేసిన పనులు ప్రేమించిన వ్యక్తి కోసం చేసినవి మాత్రమే. ఇది వ్యక్తిగతం. దీన్ని ఎందుకు ఇంతపెద్ద రాద్దాంతం చేస్తున్నారో తెలియట్లేదు. ఆమెకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు. నేను చట్టబద్ధంగానే సంపాదించాను. అదే త్వరలో న్యాయస్థానంలో రుజువు అవుతుంది.’ అని సుకేష్​ చంద్రశేఖర్​ తెలిపాడు.