Adipurush Movie collects 410 crores gross collections in six days
Adipurush collections : ప్రభాస్ (Prabhas) రాముడిగా ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్ (Adipurush) సినిమా రిలీజ్ రోజూ నుంచే వివాదాలమయంగా మారింది. ముందు నుంచి ఈ సినిమా రామాయణం (Ramayanam) అని చెప్పి, అలాగే ప్రమోట్ చేశారు. ఇక సినిమాలో రామాయణం పాత్రల స్వరూపాలు మార్చేయడంతో పాటు కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ పై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. సినిమా డైరెక్టర్, రైటర్ సినిమా రిలిజ్ తర్వాత మాట్లాడిన కొన్ని కామెంట్స్ తో సినిమా మరింత వివాదాల్లో నిలిచింది.
దేశవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమాపై ట్రోల్స్, విమర్శలు వస్తున్నాయి. పలు చోట్ల సినిమాని బ్యాన్ చేయడం, సినిమాని బ్యాన్ చేయమని అడగడం కూడా జరిగాయి. ప్రభాస్ అభిమానులతో పాటు నెటిజన్లు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆదిపురుష్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఇన్ని విమర్శలు వస్తున్నా కలెక్షన్స్ మాత్త్రం బాగానే వస్తున్నాయి. మొదటి మూడు రోజుల్లోనే 340 కోట్ల కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డ్ సాధించిన ఆదిపురుష్ సినిమా ఆ తర్వాత వీక్ డేస్ కావడంతో మెల్లిగా కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి.
Guntur Kaaram : గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ అవ్వదా? మహేశ్ అభిమానుల్లో నిరాశ..
ఆదిపురుష్ సినిమా రిలీజయి నిన్నటికి ఆరు రోజులైంది. ఆరు రోజుల్లో ఆదిపురుష్ సినిమా 410 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. చిత్రయూనిట్ దీనిని అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపు 200 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ వీకెండ్ వరకు పెద్ద సినిమాలేమి లేకపోవడంతో 500 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.
#AdiPurush divine triumph all over??#AdiPurushBlockBuster#AdiPurush3D#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar @SachetParampara @neerajkalyan_24 @TSeries @Retrophiles1 @UV_Creations @Offladipurush #Pramod #Vamsi @amb_cinemas @vishwaprasadtg… pic.twitter.com/j8LvW5l5PV
— People Media Factory (@peoplemediafcy) June 22, 2023