Dacoit OTT: ఓటీటీలో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘డెకాయిట్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అడివి శేష్ హీరోగా వచ్చిన 'డెకాయిట్(Dacoit OTT)' మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
- V Santhosh Kumar
- Published on- May 6, 2026 / 06:01 PM IST
adivi sesh dacoit movie ott streaming update
- అడివి శేష్ యాక్షన్ ప్రేమకథ.
- అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం.
- మృణాల్ ఠాకూర్ కీలక పాత్ర.
Dacoit OTT: టాలీవుడ్ హీరో అడివి శేష్ తన పంథా మార్చుకుని పూర్తిస్థాయి యాక్షన్ ప్రేమకథతో రూపొందించిన చిత్రం ‘డెకాయిట్(Dacoit OTT)’. షానియల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
Mrunal Thakur: కీర్తి కాదు.. సాయి పల్లవి కాదు.. పక్కా తెలంగాణ సినిమాలో హీరోయిన్ గా మృణాల్
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 8వ తేదీ నుండి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ సినిమాకు అడివి శేష్ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. దర్శకుడు షానియెల్ డియోతో కలిసి ఆయన ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును సిద్ధం చేశారు. ఇందులో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించి మెప్పించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణి, ప్రకాష్ రాజ్ వంటి హేమాహేమీలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించి సినిమాకు బలాన్ని చేకూర్చారు. యాక్షన్, రొమాన్స్ కలగలిసిన ఈ విభిన్నమైన చిత్రాన్ని ఇంట్లోనే కూర్చుని వీక్షించే అవకాశం ఇప్పుడు ప్రైమ్ వీడియో ద్వారా లభిస్తోంది. అడివి శేష్ అభిమానులు ఈ ఓటీటీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
