Adivi sesh: థ్రిల్లర్ స్టార్ రూట్ మార్చాడు.. యంగ్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన అడివి శేష్!

లిటిల్ హార్ట్స్ మూవీ డైరెక్టర్ సాయి మార్తాండ్ తో నెక్స్ట్ సినిమా చేస్తున్న అడివి శేష్(Adivi sesh).

adivi sesh doing his next movie with director sai marthand

  • అడివి శేష్‌తో ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ ప్యూర్ లవ్ స్టోరీ
  • సస్పెన్స్ వదిలి రొమాన్స్‌లోకి శేష్
  • బాక్సాఫీస్ వద్ద శేష్ సరికొత్త ప్రయోగం

Adivi sesh: టాలీవుడ్ హీరో అడివి శేష్ తన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డెకాయిట్’ విడుదలకు సిద్ధం అయ్యింది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా విడుదలకు ముందే తదుపరి ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చాడు అడివి శేష్(Adivi sesh). ఎప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకునే ఈ హీరో ఈసారి ఒక యంగ్ డైరెక్టర్‌కు అవకాశం ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో తన ప్రతిభను చాటుకున్న దర్శకుడు సాయి మార్తాండ్ చెప్పిన ఒక ఆసక్తికరమైన పాయింట్‌కు శేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Rajinikanth: ‘జన నాయగన్’ రిలీజ్ పై రజనీకాంత్ ఏమన్నాడో తెలుసా.. సాటి నటుడుగా

సాధారణంగా అడివి శేష్ స్క్రిప్ట్ సెలక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కథలో బలం ఉంటేనే తప్ప ప్రాజెక్టును పట్టాలెక్కించని ఆయన, సాయి మార్తాండ్ వినిపించిన లైన్‌కు వెంటనే ఫిదా అయ్యారంటే అందులో ఏదో వైవిధ్యం ఉండే ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన శేష్, ఈసారి తన రూట్ మార్చి ఒక ప్యూర్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించబోతున్నారనే వార్త ఆసక్తిని కలిగిస్తోంది.

సాయి మార్తాండ్ తన మొదటి సినిమా ‘లిటిల్ హార్ట్స్’తో రొమాంటిక్ జోనర్‌లో సక్సెస్ అందుకోగా, ఇప్పుడు శేష్‌తో కూడా అదే తరహా మ్యాజిక్ రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. క్షణం, గూఢచారి, మేజర్ వంటి ఇంటెన్స్ సినిమాల తర్వాత శేష్ మళ్ళీ పూర్తిస్థాయి రొమాంటిక్ మోడ్‌లోకి వెళ్తుండటం విశేషం. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.