Rajinikanth: ‘జన నాయగన్’ రిలీజ్ పై రజనీకాంత్ ఏమన్నాడో తెలుసా.. సాటి నటుడుగా
విజయ్ జన నాయగన్ సినిమా విడుదలై ఆసక్తికర కామెంట్స్ చేసిన రజనీకాంత్(Rajinikanth).
Rajinikanth Shocking Comments on vijay Jana Nayagan movie
Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన తాజా చిత్రం ‘జైలర్ 2’ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులు ఆయనను పలకరించగా, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల వాయిదా పడటంపై రజనీ స్పందన కోరగా.. ‘నో కామెంట్స్’ అంటూ సున్నితంగా సమాధానాన్ని దాటవేశారు. ఇక తన తదుపరి ప్రాజెక్టుల గురించి చెబుతూ, కమల్ హాసన్‌తో కలిసి తాను నటించబోయే సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభమవుతుందని వెల్లడించారు. ‘జైలర్ 2’ షూటింగ్ తుది దశకు చేరుకుందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారని తెలిపారు.
అదే సమయంలో రజనీకాంత్(Rajinikanth) యువతకు విలువైన సందేశాన్ని ఇచ్చారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు చదువుపైనే పూర్తి దృష్టి సారించాలని, ఆ సమయాన్ని వృథా చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని అన్నారు. ముఖ్యంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ అలవాటు జీవితాలను నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. కష్టకాలంలో ఎవరి నొప్పిని వారే భరించాల్సి ఉంటుందని, కాబట్టి యువత ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని రజనీ హితబోధ చేశారు. దీంతో, రజనీకాంత్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
