Jabardasth Faima: నల్లగా ఉన్నావంటూ ట్రోల్స్.. అమ్మను అడిగి ఏడ్చాను.. గతాన్ని తలుచుకుని ఫైమా కన్నీళ్లు
తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అవమానాల గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ ఫైమా(Jabardasth Faima).
Jabardasth Faima gets emotional while she faced humiliation at beginning of her career.
- జబర్దస్త్ ఎమోషనల్ కామెంట్స్
- వచ్చే జన్మలో మగాడిగా పుట్టాలనుందంటూ ఆవేదన
- ఆడపిల్లగా పుట్టినందుకు హ్యాపీగా లేను అన్న ఫైమా
Jabardasth Faima: జబర్దస్త్ కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఫైమా. కానీ, కెరీర్ ప్రారంభంలో చాలా అవమానాలను ఎదుర్కొందట. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆమె తన జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కెరీర్ ప్రారంభంలో కేవలం రంగు కారణంగా తాను తీవ్రమైన వివక్షను, అవమానాలను ఎదుర్కొన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నెటిజన్లు తనను వికృతంగా ఉన్నావంటూ ట్రోల్ చేసినప్పుడు, ఆ బాధ భరించలేక తనను ఎందుకు నల్లగా కన్నావని తల్లిని అడిగి ఏడ్చానంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు.
Dacoit Censor Review: ‘డెకాయిట్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. అడివి శేష్ సినిమా ఎలా ఉందంటే?
నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె, చిన్నప్పుడు సరైన బట్టలు కూడా లేక అక్కల పాత దుస్తులనే ధరించాల్సి వచ్చేదని తెలిపారు. సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల ఫైమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లలపై అకృత్యాలకు పాల్పడే దుర్మార్గులకు అత్యంత కఠినమైన శిక్షలు పడాలని, వారిని క్షమించకూడని నేరగాళ్లుగా అభివర్ణించారు. తనకు గనుక అధికారముంటే అలాంటి వారికి వారు అనుభవించే శిక్ష(Jabardasth Faima) కళ్లారా చూసేలా చేస్తానని ఘాటుగా స్పందించారు. ఆడపిల్లగా పుట్టి, ఈ సమాజంలో బతకడం చాలా కష్టమైన విషయమని ఆమె తన మనోవేదనను బయటపెట్టారు.
ప్రస్తుతం వరుస షోలతో కెరీర్ పరంగా దూసుకుపోతున్నప్పటికీ, ఒక మహిళగా తాను ఎదుర్కొంటున్న సవాళ్లు తనను ఎంతగానో కుంగదీస్తున్నాయని ఫైమా పేర్కొన్నారు. ఆడపిల్లగా పుట్టినందుకు తాను ఏ మాత్రం సంతోషంగా లేనని, ఈ జన్మలో అనుభవించిన కష్టాలు చాలని భావిస్తున్నారు. అందుకే వచ్చే జన్మలోనైనా తాను ఒక మగాడిగా పుట్టాలని బలంగా కోరుకుంటున్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
