Adivi Sesh: ‘హిట్-2’పై అడివి శేష్ సాలిడ్ అప్‌డేట్
యంగ్ హీరో అడివి శేష్ నటించిన రీసెంట్ మూవీ ‘ మేజర్’ భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ హీరో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తన నెక్ట్స్ మూవీ ‘హిట్2’ను జూలైలోనే రిలీజ్ చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది కుదరడం లేదని అడివి శేష్ చెప్పుకొచ్చాడు. హిట్2 సినిమాపై ఆయన ట్విట్టర్ వేదికగా తాజా అప్డేట్ ఇచ్చారు.
- Anil Aaleti
- Published On : July 23, 2022 / 04:56 PM IST
Hit 2 Movie Update
Adivi Sesh: యంగ్ హీరో అడివి శేష్ నటించిన రీసెంట్ మూవీ ‘ మేజర్’ భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ హీరో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సినిమా కోసం అడివి శేష్ చాలా కష్టపడ్డాడు. తన కష్టం ఫలించినందుకు సంతోషంగా ఉందని పలు ఇంటర్వ్యూల్లో అడివి శేష్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ హీరో మేజర్ ఇంతటి గ్రాండ్ సక్సెస్ కావడానికి చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ కూడా చాలా ఉపయోగపడ్డాయి.
Adivi Sesh : నాకు ఆయనలా లవ్ అఫైర్లు లేవు.. కానీ లవ్ లో దెబ్బ తిన్నాను..
కాగా, మేజర్ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ దేశవ్యప్తంగా ప్రమోషన్స్ నిర్వహించింది. ఇక అడివి శేష్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్‌లో హిట్ మూవీ సీక్వెల్‌లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాను జూలై 29న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ అడివి శేష్ మేజర్ సినిమా కోసం పడ్డ కష్టం వలన ఆయన చాలా అలిసిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.
Adivi Sesh: నెల గ్యాప్‌లో అడవి శేష్ రెండు సినిమాల రిలీజ్.. మహేష్, నానీల సపోర్ట్!
హిట్ 2 సినిమా ఫైనల్ షెడ్యూల్‌ను ఈ నెలలో పూర్తి చేయాల్సి ఉంది. కానీ తాను నిర్మాత నాని, డైరెక్టర్ శైలేష్ కొలనులను తనకు కాస్త సమయం కావాలని కోరగానే వారు ఒప్పుకోవడంతో ఈ సినిమా రిలీజ్ మరికొంత లేట్ అవుతుందని అడివి శేష్ చెప్పుకొచ్చాడు. వచ్చే నెలలో ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను ముగించి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేస్తామని.. కరెక్ట్ టైమ్‌లో హిట్2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఫైర్ క్రియేట్ చేసేందుకు వస్తామని అడివి శేష్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా హిట్2 సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఇది కొంతమేర గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
#HIT2 will come with a BANG!
But at the right time ?#FinalSchedule Next Month pic.twitter.com/KbljRmx386
— Adivi Sesh (@AdiviSesh) July 23, 2022
