Adivi Sesh : నాగచైతన్య పెళ్లిని అడివి శేష్ భలే వాడుకున్నాడే.. మంచి పనే చేసాడు..
అడివి శేష్ డెకాయిట్ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.(Adivi Sesh)
- Saketh U
- Published On : March 12, 2026 / 07:08 AM IST
Adivi Sesh
Adivi Sesh : లేట్ గా సినిమాలు తీసుకువస్తున్నా వరుసగా హిట్స్ కొడుతున్న హీరోల్లో అడివి శేష్ ఒకరు. అడివి శేష్ డెకాయిట్ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, సాంగ్ తో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు, దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించగా అనురాగ్ కశ్యప్ ఈ సినిమా ఎలా ఒప్పుకున్నాడో తెలిపాడు. అనురాగ్ మాట్లాడుతూ.. నేను హైదరాబాద్ లో ఓ పెళ్ళికి వచ్చాను. అక్కడ నన్ను పట్టుకుని ఈ కథ చెప్పి ఒప్పించాడు అని అన్నారు. అడివి శేష్ మాట్లాడుతూ.. అనురాగ్ నాగచైతన్య పెళ్ళికి వచ్చారు రెండేళ్ల క్రితం. అప్పుడు పెళ్లి మండపంలోని ఓ మూలకు టెంట్ లో కూర్చొని అనురాగ్ గారికి కథ చెప్పాను. చైతన్య పెళ్లి నాకు ఇలా ఉపయోగపడింది అని అన్నారు. అనురాగ్ కి ఇదే మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా కావడం గమనార్హం.
Also Read : Ek Din : ఆమిర్ ఖాన్ కొడుకుతో సాయి పల్లవి రొమాన్స్.. వీడియో వైరల్
