పవన్ పిల్లలతో అడవి శేష్.. విషయం ఏంటంటే?
- veegam team
- Updated on- August 4, 2021 / 12:52 PM IST
Adivi Seshu
పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ల కుమారుడు అకీరాని త్వరలో వెండితెరపై చూడాలని పవన్ అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.. కానీ రేణూ మాత్రం తన కొడుకుని సినీ ఫీల్డ్ లోకి పంపించనని చెబుతోంది. కానీ అప్పుడప్పుడు అకీరా ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇక ఇటీవల హీరో అడవి శేష్.. రేణు దేశాయ్ ఇంటికి వెళ్లి అకీరా, ఆద్యాలతో సమయం గడిపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అడవి శేష్.. రేణూ దేశాయ్, అకీరా లతో సెల్ఫీ దిగి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అంతేకాదు అకీరాకు ‘ఎవరు’ సినిమా చాలా బాగా నచ్చింది. లంచ్ చేస్తున్న సమయంలో అకీరాతో నేను అనేక విషయాలు మాట్లాడాను. అకీరా వాయిస్ చాలా గంభీరంగా ఉంది అని తెలిపారు. ఇంకో స్పెషల్ ఏంటంటే.. మేమిద్దరం లెఫ్ట్ హ్యాండ్ రైటర్స్.. అంతే కాదు మా ఇద్దరిలో చాలా విషయాలు కామన్ గా ఉన్నాయి అని అకిరా గురించి శేష్ చెప్పుకొచ్చాడు. ఆద్యకి కొంచెం సిగ్గు ఎక్కువ. కెమెరా ముందు భయపడుతుంటుంది అని అడవి శేష్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
