Major Movie : ఆ సంఘటన చెబితే నమ్ముతారోలేదో అని సినిమాలో పెట్టలేదు
అడివి శేష్ మాట్లాడుతూ సందీప్ గురించి ఎవరికీ తెలియని ఓ సంఘటనని షేర్ చేసుకున్నాడు. ''ఆయన గురించి చాలా లోతుగా తెలుసుకుంటుండగా షాకింగ్ కు గురయ్యే సంఘటన............
- Saketh U
- Published On : May 29, 2022 / 01:30 PM IST
Major
Major Movie : అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం మేజర్. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు అడివి శేష్ ప్రమోషన్‌లో భాగంగా దేశమంతా పర్యటిస్తున్నారు. తాజాగా తెలుగు మీడియాకు ఆయన ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు.
Pn India Stars : RRR, KGF స్టార్లు ఏం చేస్తున్నారు??
ఈ ఇంటర్వ్యూలో భాగంగా అడివి శేష్ మాట్లాడుతూ సందీప్ గురించి ఎవరికీ తెలియని ఓ సంఘటనని షేర్ చేసుకున్నాడు. ”ఆయన గురించి చాలా లోతుగా తెలుసుకుంటుండగా షాకింగ్ కు గురయ్యే సంఘటన ఒకటి తెలిసింది. ఇండియన్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుని తిరిగి ట్రైన్‌లో ఇంటికి వెళుతుండగా సందీప్ ఫ్రెండ్ కూడా అతనితో ఉన్నాడు. తను అస్సాం వెళుతున్నాడు. సందీప్ బెంగుళూరు వెళ్లాలి. ఆ సమయంలో ఆయన ఫ్రెండ్ నా దగ్గర డబ్బులు లేవు అని అడగడంతో తన జేబులోని వున్న మొత్తం డబ్బులు ఇచ్చేశాడు సందీప్. ఆ తర్వాత సందీప్ బెంగుళూరు వచ్చేవరకు ప్రయాణంలో ఏమీ తినలేదు. తాగలేదు. మిలట్రీ మనిషి కాబట్టి ఎవరినీ ఏమీ అడగకూడదు అనే రూల్ ఉంటుంది. కానీ ఇలాంటి సంఘటన చెబితే నమ్ముతారో లేదో అని మేజర్ సినిమాలో ఈ సంఘటనని పెట్టలేదు.
