Agent Movie: కె.విశ్వనాథ్ మృతికి సంతాపంగా ఏజెంట్ అప్డేట్ వాయిదా.. ఎప్పుడో తెలుసా?
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ నుండి ఓ మాసివ్ అప్డేట్ ఇవాళ రానుందని చిత్ర యూనిట్ నిన్న ప్రకటించింది. దీంతో ఈ సినిమా నుండి రాబోతున్న ఈ అప్డేట్ ఏమై ఉంటుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ఈ సినిమా అప్డేట్ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతితో ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా షాక్కు గురయ్యాయి.
- Anil Aaleti
- Updated on- February 4, 2023 / 12:45 AM IST
Agent Movie: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ నుండి ఓ మాసివ్ అప్డేట్ ఇవాళ రానుందని చిత్ర యూనిట్ నిన్న ప్రకటించింది. దీంతో ఈ సినిమా నుండి రాబోతున్న ఈ అప్డేట్ ఏమై ఉంటుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ఈ సినిమా అప్డేట్ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతితో ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా షాక్కు గురయ్యాయి.
Agent Movie: ఎట్టకేలకు ‘ఏజెంట్’పై మాసివ్ అప్డేట్ వచ్చేస్తుందోచ్!
ఆయన మృతికి సంతాపంగా తమ ఏజెంట్ సినిమా అప్డేట్ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. కె.విశ్వనాథ్ మృతితో టాలీవుడ్ విషాదంలోకి వెళ్లిపోయిందని.. ఇలాంటి సమయంలో తమ సినిమా అప్డేట్ ఇవ్వడం సరికాదని భావించి, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమా నుండి రాబోతున్న అప్డేట్ను తిరిగి ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఏజెంట్ సినిమా అప్డేట్ను ఒక్క రోజు వాయిదా వేశామని.. ఫిబ్రవరి 4న ఈ చిత్రం నుండి మాసివ్ అప్డేట్ ఉండబోతుందని చిత్ర యూనిట్ కన్ఫం చేసింది. దీంతో అఖిల్ అభిమానులు ఈ అప్డేట్ కోసం మళ్లీ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సాక్షి వైద్యా హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
