Aha : ‘ఆహా’లో తెలుగు ‘ఇండియన్ ఐడిల్’కి విశేష స్పందన!..
100 % తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ఇప్పుడు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది..
- sekhar
- Published on- January 15, 2022 / 09:12 PM IST
Telugu Indian Idol
Aha: 100 % తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ఇప్పుడు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ‘ఆహా’… తన తదుపరి షో ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అత్యుత్తమ సింగింగ్ టాలెంట్‌ను గుర్తించాలనే ఆశయంతో సరికొత్త అడుగు వేసింది. అందుకోసం తెలుగు వారిలోని గాత్ర ప్రతిభను వెలికితీయడానికి, సరైన వేదిక కల్పించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద పాటల పోటీని తెలుగులోకి తీసుకువస్తోంది.
Unstoppable with NBK : బాలయ్య దెబ్బకి ‘థింకింగ్’ మారిపోతుందని ముందే చెప్పాం-‘ఆహా’ టీం
ఈ కార్యక్రమాన్ని సింగింగ్ సెన్సేషన్ శ్రీరామ చంద్ర హోస్ట్ చేస్తున్నారు. ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ కు ఆన్లైన్ ఆడిషన్స్‌ను రీసెంట్గా నిర్వహించారు. దక్షిణాదిన నిర్వహించిన ఇండియన్ ఐడిల్ కాంపిటీషన్. ఆహా..ఇన్స్టాగ్రామ్ వారి కో పవర్డ్‌గా జనవరి 7 నుంచి ఆడిషన్స్ జరిగాయి. దీనికి అపూర్వమైన స్పందన వచ్చింది.
Allu Arjun : ‘‘సౌత్ కా సుల్తాన్’’.. ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్..
వర్ధమాన గాయకులు, సంగీతకారులు సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నవారందరూ ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ ఆడిషన్స్‌కు ఆన్లైన్ రిజిష్టర్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందన అద్భుతంగా ఉంది. వీరందరూ తమ ప్రతిభను ఇంత పెద్ద వేదికపై చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఆన్లైన్ ఆడిషన్స్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 5000 ఎంట్రీలు వచ్చాయి. ఇదే, ఈ ప్రోగ్రామ్‌పై ఉన్న ఎక్స్పెక్టేషన్స్కు ఉదాహరణ. ఈ ఆన్లైన్ ఆడిషన్స్ జనవరి 16న ముగియనున్నాయి.
Arjuna Phalguna : ‘ఆహా’ లో ‘అర్జున ఫల్గుణ’.. ఎప్పుడంటే..
‘ఆహా’ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ విషయానికి వస్తే ..‘ది అమెరికన్ డ్రీమ్’, ‘లక్ష్య’, ‘సేనాపతి’, ‘త్రీ రోజెస్’, ‘లాభం’, ‘మంచి రోజులు వచ్చాయి’, ‘రొమాంటిక్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, ‘అనుభవించు రాజా’, ‘సర్కార్’, ‘చెఫ్ మంత్ర’, ‘అ్లల్లుడు గారు’, ‘క్రిస్మస్ తాత’.. ఇలా ఎన్నో ఆసక్తికరమైన సినిమాలు, షోస్‌తో పాటు ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ (దక్షిణాదిలో నిర్వహిస్తున్న ఇండియన్ ఐడిల్).. త్వరలోనే ‘ఆహా’లో ప్రసారం కానుంది. అలాగే ‘ఆహా’లో ప్రేక్షకులను మెప్పిస్తున్న బాలకృష్ణ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (ఈ టాక్ షోను 9.7 రేటింగ్‌తో ఐఎండీబీ నెంబర్ వన్ షోగా గుర్తించింది) ప్రేక్షకులను అలరిస్తోంది.
