Telugu Indian Idol 2 : మొదలైన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2.. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఫస్ట్ ఎపిసోడ్..
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఇటీవలే సీజన్ 2 కి ఆడిషన్స్ నిర్వహించి అనేకమంది సింగర్స్ ని తీసుకొచ్చి షోని గ్రాండ్ గా మొదలుపెట్టారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2ని.............
- Saketh U
- Published On : March 4, 2023 / 08:49 AM IST
Aha Telugu Indian Idol season 2 first episode streaming now
Telugu Indian Idol 2 : తెలుగు ఓటీటీ ఆహా రకరకాల కొత్త సినిమాలు, షోలు, సిరీస్ లతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తెలుగు ఇండియన్ ఐడల్, అన్ స్టాపబుల్, చెఫ్ మంత్ర, సర్కార్, కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్.. లాంటి పలు కొత్త రకాల షోలు ఆహాకి విశేష ప్రజాదరణ తెచ్చిపెట్టాయి. దీంతో పలు షోలకు సీజన్ 2 అంటూ కొనసాగింపుగా మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో తెలుగు ఇండియన్ ఐడల్ అంటూ లోకల్ సింగర్స్ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి సరికొత్త షోని తీసుకొచ్చి గ్రాండ్ సక్సెస్ చేసి ఎంతో మంది సింగర్స్ ని పరిచయం చేశారు.
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఇటీవలే సీజన్ 2 కి ఆడిషన్స్ నిర్వహించి అనేకమంది సింగర్స్ ని తీసుకొచ్చి షోని గ్రాండ్ గా మొదలుపెట్టారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2ని సింగర్ హేమచంద్ర హోస్ట్ చేస్తుండగా జడ్జీలుగా తమన్, సింగర్ కార్తీక్, సింగర్ గీతా మాధురిలు ఉన్నారు.
Megha Akash : హీరోయిన్ మేఘ ఆకాష్ ఇంట్లో విషాదం.. నువ్వు లేకుండా ఎలా బతకాలి అంటూ ఎమోషనల్ పోస్ట్..
తాజాగా ఈ సీజన్ నుంచి మొదటి ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. మొదటి ఎపిసోడ్ లో అనేక మంది కొత్త సింగర్స్ తో, బోల్డంత ఎంటర్టైన్మెంట్ తో సాగింది. ఈ ఎపిసోడ్ ని ఆహాలో చూసేయొచ్చు. ప్రతి శుక్రవారం, శనివారం తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఎపిసోడ్స్ ఆహాలో స్ట్రీమ్ అవ్వనున్నాయి. అలాగే ఇన్నాళ్లు ఆహా సబ్‌స్క్రిప్షన్ సంవత్సరానికి 399 ఉండగా మార్చ్ మహా ఆఫర్ అంటూ 299కే అందిస్తుంది. దీంతో మరింతమంది ఆహా ఓటీటీని సబ్ స్క్రైబ్ చేసుకుంటున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కూడా గత సీజన్ లాగే మంచి హిట్ అవుతుందని, పలువురు ప్రముఖులు మధ్యలో గెస్టులుగా వస్తూ ఉంటారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
అదిరిపోయే పెరఫార్మన్సెస్ , అన్ లిమిటెడ్ ఫన్ , ఎక్సయిటింగ్ మ్యూజిక్… మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ మీ ముందుకు వచ్చేసింది… ఎపిసోడ్ 1 వెంటనే చూసేయండి….#Teluguindianidol2 – Every Friday-Saturday, only on aha…
▶️https://t.co/vyzYisAfQX pic.twitter.com/21ivogEpdf— ahavideoin (@ahavideoIN) March 3, 2023
