Megha Akash : హీరోయిన్ మేఘ ఆకాష్ ఇంట్లో విషాదం.. నువ్వు లేకుండా ఎలా బతకాలి అంటూ ఎమోషనల్ పోస్ట్..

తాజాగా మేఘ ఆకాష్ తన అమ్మమ్మ చనిపోయిందంటూ తన అమ్మమ్మతో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఓ ఎమోషనల్ నోట్ రాసింది...................

Megha Akash : హీరోయిన్ మేఘ ఆకాష్ ఇంట్లో విషాదం.. నువ్వు లేకుండా ఎలా బతకాలి అంటూ ఎమోషనల్ పోస్ట్..

Heroine Megha akash grand mother passes away she post emotionally in social media with her photos

Updated On : March 4, 2023 / 7:36 AM IST

Megha Akash :  తెలుగులో లై, చల్ మోహన్ రంగ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన మేఘ ఆకాష్ అనంతరం తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. ఇటీవలే ప్రేమదేశం అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. ప్రస్తుతం మేఘ ఆకాష్ చేతిలో దాదాపు అరడజను తమిళ్, తెలుగు సినిమాలు ఉన్నాయి. తాజాగా మేఘ ఆకాష్ తన అమ్మమ్మ చనిపోయిందంటూ తన అమ్మమ్మతో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఓ ఎమోషనల్ నోట్ రాసింది.

Shraddha Kapoor : శ్రద్ధా కపూర్ పుట్టిన రోజు.. శ్రద్ధా కారుని చుట్టుముట్టిన అభిమానులు..

మేఘ ఆకాష్ సోషల్ మీడియాలో తన అమ్మమ్మతో ఉన్న ఫోటోలు పోస్ట్ చేసి.. ప్రియమైన అమ్మమ్మ నువ్వు లేకుండా నేను ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు, ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఎలా బతకాలి. కానీ నేను నీలాంటిదాన్ని కాబట్టి ఎలాగైనా బతికేస్తాను. నువ్వు చాలా మంచిదానివి, సరదాగా ఉంటావు. అందరికి కడుపు నింపుతావు, వాళ్ళ మొహంలో సంతోషం చూస్తావు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి, నీతో రోజూ మాట్లాడేదాన్ని. ఇప్పుడు నువ్వు మాట్లాడవు, కనపడవు, వినపడవు అనేది నేను ఊహించుకోలేకపోతున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నీ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయావు. మనం కలిసి ఉన్న ఆదివారాలు అన్నిటికి చాలా పెద్ద థ్యాంక్స్. ఇకపై నా ఆదివారాలు అంతకుముందులా ఉండవు. మా అందరిలోనూ నిన్ను చూసుకుంటాము. నీ ఆత్మకు శాంతి చేకూరాలి మళ్ళీ మనం కలుసుకునేవరకు అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. మేఘ ఆకాష్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Megha Akash (@meghaakash)