Ahimsa Movie: ‘కృష్ణుడు కన్నా బుద్దుడు మిన్న అంటున్న’ రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి.. “అహింస” డైలాగ్ పోస్టర్స్ రిలీజ్!

తెలుగులో ఎంతోమంది హీరో, హీరోయిన్స్ ని పరిచయం చేసిన దర్శకుడు తేజ ఇప్పుడు దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ "అహింస" అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఒక గ్లింప్స్ కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి...

  • Published On : September 16, 2022 / 04:06 PM IST

Ahimsa Movie Main Leads Voice Posters Released

Ahimsa Movie: తెలుగులో ఎంతోమంది హీరో, హీరోయిన్స్ ని పరిచయం చేసిన దర్శకుడు తేజ ఇప్పుడు దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ “అహింస” అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఒక గ్లింప్స్ కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Ahimsa Glimpse : దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ.. ‘అహింస’ గ్లింప్స్ రిలీజ్.. తేజ మార్క్ రా&రస్టిక్..

తేజ మార్క్ రా&రస్టిక్ గా సాగిన ఆ గ్లింప్స్ ప్రేక్షకులలో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. అదేంటంటే సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్స్, అలానే సినిమాలో ఆ పాత్రలు చెప్పిన డైలాగ్స్ ను ఆ పోస్టర్స్ కు జతచేసి మూవీ టీం ఒక డైలాగ్ పోస్టర్స్ ప్రోమోని విడుదల చేసింది.

“కృష్ణుడు మాటలు విని.. దేశం మొత్తం యుద్దాలు చేసుకుంటూ ఒకరిని ఒకరు చంపుకుంటుంటే, బుద్దుడు వచ్చి అహింసో పరమో ధర్మః అన్నాడు” అంటూ దగ్గుబాటి అభిరామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. గీతికా, రజత్ బేడీ, సదా, మనోజ్ టైగర్ ప్రధాన తారాగణంగా కనిపించనుండగా రవి కాలే, కమల్ కామరాజు, కల్ప లత, దేవి ప్రసాద్ వంటి వారు కూడా ఈ సినిమాలో మెరవనున్నారు. మరి తేజ, దగ్గుబాటి అభిరామ్ కు ఏ రేంజ్ ఎంట్రీ కలిపిస్తాడో చూడాలి.