Ahimsa Glimpse : దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ.. ‘అహింస’ గ్లింప్స్ రిలీజ్.. తేజ మార్క్ రా&రస్టిక్..

  తెలుగులో ఎంతోమంది హీరో, హీరోయిన్స్ ని పరిచయం చేసిన దర్శకుడు తేజ ఇప్పుడు మరో హీరోని పరిచయం చేయబోతున్నాడు. దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ తేజ ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు. గతంలోనే ఈ సినిమాని అనౌన్స్ చేసి............

Ahimsa Glimpse : దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ.. ‘అహింస’ గ్లింప్స్ రిలీజ్.. తేజ మార్క్ రా&రస్టిక్..

Daggubati Abhiram first Movie Ahimsa Glimpse released

Ahimsa Glimpse :  తెలుగులో ఎంతోమంది హీరో, హీరోయిన్స్ ని పరిచయం చేసిన దర్శకుడు తేజ ఇప్పుడు మరో హీరోని పరిచయం చేయబోతున్నాడు. దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ తేజ ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు. గతంలోనే ఈ సినిమాని అనౌన్స్ చేసి అహింస అనే టైటిల్ ని ప్రకటించారు.

ఇప్పటికే తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా తెరకెక్కుతున్న అహింస సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇందులో హీరో పాత్రని ఓ అడవిలో కొందరు ముసుగుతో తీసుకెళ్తుండగా అతను తప్పించుకొని పారిపోడానికి ప్రయత్నించడం, వాళ్ళు మళ్ళీ లాక్కొచ్చి కొట్టడం చేశారు. ఇందులో తేజ మార్క్ వైలెన్స్ కనిపిస్తుంది. ఈ గ్లింప్స్ చూస్తే సినిమా చాలా రా&రస్టిక్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక తేజ- ఆర్పీ పట్నాయక్ కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఈ సినిమాకి కూడా ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ ఇస్తున్నాడు. తాజాగా గ్లింప్స్ లో ఆర్పీ పట్నాయక్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా సెట్ అయింది.

Samantha: 1800 పైగా థియేటర్లో సమంత యశోద టీజర్ రిలీజ్.. ప్రెగ్నెన్సీతో సమంత యాక్షన్స్

దగ్గుబాటి నుంచి మరో వారసుడు రావడం, అది కూడా తేజ డైరెక్షన్ లో ఎంట్రీ ఇస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి దగ్గుబాటి అభిరామ్ ఏ రేంజ్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడో చూడాలి.