Sasha Chettri : ప్రభాస్ పక్కన ఎయిర్‌టెల్ బ్యూటీ..

రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేసింది సాషా..

Sasha Chettri

Sasha Chettri: ఒకే ఒక్క యాడ్‌తో బోలెడంత పాపులర్ అయ్యింది సాషా చెట్రి. డెహ్రాడూన్‌కి చెందిన సాషా స్టడీస్‌తో మోడలింగ్ చెయ్యడం, యాడ్స్‌లో నటించడం చేస్తుంది. ఎయిర్‌టెల్ యాడ్‌లో నటించి ఆకట్టుకుని, ఎయిర్‌టెల్ పాపగా గుర్తింపు తెచ్చుకుంది.

Radhe Shyam : సంక్రాంతికి ‘రాధే శ్యామ్’.. ‘వర్షం’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?

ఈ అమ్మడు ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేసింది సాషా. ఈ మూవీలో ఆమె రోల్ మిస్టీరియస్ ఎలిమెంట్స్‌తో కథకి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే ‘రాధే శ్యామ్’ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యనున్నారు.

ఇంతకుముందు ఆది సాయి కుమార్ ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ మూవీలో యాక్ట్ చేసింది సాషా. రైటర్ అబ్బూరి రవి విలన్‌గా నటించారు. సినిమా పెద్దగా ఆడకపోవడంతో అందులో సాషా కానీ అబ్బూరి రవి కానీ నటించినట్లు చాలా మందికి తెలియలేదు. ‘రాధే శ్యామ్’ క్రేజీ పాన్ ఇండియా సినిమా కావడం, పైగా తన క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో, ఈ సినిమా ద్వారా మరిన్ని ఆఫర్లు వస్తాయనే నమ్మకమంతో ఉంది సాషా చెట్రి.