Aishwarya Lakshmi: పెళ్లి వద్దు సహజీవనం ముద్దు.. సంచలన కామెంట్స్ చేసిన ఐశ్వర్య లక్ష్మి
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన కన్నడ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi).
- V Santhosh Kumar
- Published On : March 22, 2026 / 07:22 AM IST
Aishwarya Lakshmi Shocking Comments on Marriage
Aishwarya Lakshmi: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా వారి వివాహంపై రకరకాల పుకార్లు రావడం మనం చూస్తూనే ఉంటాం. గతంలో అనుష్క, త్రిష వంటి చాలా మంది స్టార్ హీరోయిన్ల పెళ్లి గురించి ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే, వీరందరికీ భిన్నంగా నటి ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) మాత్రం తన పెళ్లి విషయంలో చాలా క్లారిటీగా ఉంది. 34 ఏళ్ల వయసున్న ఈ అమ్మడు, తనకు పెళ్లి పట్ల అస్సలు ఆసక్తి లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేసింది.
29 ఏళ్ల వయసులోనే తనకు పెళ్లిపై పూర్తి అవగాహన వచ్చిందని, వైవాహిక బంధంలోకి అడుగుపెట్టే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేస్తోంది. తన నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరని, సంతోషకరమైన జీవితం గడపడానికి పెళ్లి అనేది తప్పనిసరి నిబంధన కాదని ఆమె బలంగా నమ్ముతోంది. చుట్టూ ఉన్న సమాజంలో అనేక వివాహాలను గమనించిన తర్వాతే ఐశ్వర్య ఈ నిర్ణయానికి వచ్చింది.
Ntr: ఎన్టీఆర్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్.. సినిమా కోసం ప్రాణం పెడుతున్నాడుగా
మూడు దశాబ్దాల తన జీవితంలో ఎన్నో జంటలను చూశానని, కానీ వారిలో మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నవారు చాలా తక్కువ మంది మాత్రమేనని ఆమె అభిప్రాయపడింది. ముఖ్యంగా పెళ్లి తర్వాత భాగస్వాముల కెరీర్ లో ఆటంకాలు కలగడం తనను ఆలోచింపజేసిందని పేర్కొంది. ఒకప్పుడు తను కూడా పెళ్లి గురించి ఎన్నో అందమైన కలలు కన్నానని, కానీ కాలక్రమేణా ఆ ఆలోచనలు మారిపోయాయని తెలిపింది. ఒంటరిగా ఉండటం కంటే, మనసులు కలిసిన వ్యక్తితో పెళ్లి అనే బంధం లేకుండా సహజీవనం చేయడమే మంచిదని అంటోంది.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒకానొక సమయంలో ఐశ్వర్య కూడా తన కెరీర్ పక్కన పెట్టి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో తన ప్రొఫైల్‌ను మ్యాట్రిమోనీ సైట్‌లో పెట్టిందట. కానీ, ఒక సెలబ్రిటీ ప్రొఫైల్ కావడంతో అది ‘ఫేక్’ అని భావించి చాలామంది లైట్ తీసుకున్నారట. సరిగ్గా అదే సమయంలో పెళ్లి అనే వ్యవస్థపై ఆమె ఆలోచనా దృక్పథం పూర్తిగా మారిపోయిందట. ఇద్దరు వ్యక్తుల మధ్య మనశ్శాంతి, తృప్తి ఉండాలి, కానీ అది పెళ్లితోనే సాధ్యం కాదని ఆమె గట్టిగా చెబుతోంది. ఇంతటి స్పష్టమైన అభిప్రాయాలు కలిగి ఉంది కాబట్టే, ప్రస్తుతం ఆమె పెళ్లి గురించి ఎలాంటి పుకార్లు వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో. ఐశ్వర్య లక్ష్మి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
