Aishwarya Rai : విడాకుల రూమర్స్.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఐశ్వర్య రాయ్ ఫొటోస్ వైరల్..

Aishwarya Rai enjoying with family photos viral

Aishwarya Rai : బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈమె తన భర్తతో విడాకులు తీసుకుంటుందని గత కొంత కాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్య రాయ్ ఎక్కడికి వెళ్లినా కేవలం తన కూతురితోనే కనిపించడంతో ఈ వార్తలు తెరపైకి వచ్చాయి.

Also Read : Prabhas Birthday : ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన సెలబ్రిటీలు.. ఎవరెవరు ఎలా విషెస్ చెప్పారంటే..?

అయితే తాజాగా ఐశ్వర్య రాయ్ తన ఫామిలీతో క్వాలిటీ సమయాన్ని గడిపారు. ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి తన కజిన్ పుట్టిన రోజు వేడుకలకి హాజరయ్యారు. ఇక విడాకుల రూమర్స్ తర్వాత ఐశ్వర్య తన భర్త లేకుండా కేవలం తన కూతురుతో మాత్రమే కనిపించడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇక ఆ ఫోటో గమనిస్తే.. ఐశ్వర్య రాయ్ స్కూల్ యూనిఫార్మ్ లో ఉన్న తన కూతురిని పట్టుకొని ఉంది. ఆ పక్కనే తన తల్లి కూడా ఉంది. మొత్తనికి ఐశ్వర్య తన భర్త లేకుండా ఫ్యామిలీతో మాత్రమే ఫొటోస్ పెట్టడంతో తన భర్త కి విడాకులు ఇచ్చేసి ఒంటరిగా ఉంటుందేమో అన్న కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.