Isakapatnam : ఓటీటీలో ఐశ్వర్య రాజేష్ కొత్త సిరీస్.. ఇసాకపట్నం ఎప్పుడో తెలుసా?
సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ఇసాకపట్నం(Isakapatnam ).
- Thota Vamshi Kumar
- Updated on- June 11, 2026 / 07:20 PM IST
Aishwarya Rajesh Isakapatnam OTT Release Date fix
Isakapatnam : సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ఇసాకపట్నం. గ్యారీబీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఏడు ఎపిసోడ్‌ల యాక్షన్ థ్రిలర్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్ నేథప్యంలో రూపుదిద్దుకున్న ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ తేదీని తాజాగా అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. జూలై 2 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ సిరీస్‌లో సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్కనకాల, మైమ్ గోపి, రోహిణి, బెనర్జీ, జ్వాలా కోటి, రవివర్మ, రాజాచెంబోలు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ రాఘతి కథా రచన అందించగా, తాజుద్దీన్ సయ్యద్ సంభాషణలు రాశారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డిబొర్రాలు నిర్మించారు.
Aishwarya Rajesh : ఐశర్వ రాజేష్ గ్లామర్ షో.. స్టన్నింగ్ ఫోటోలు..
స్ట్రీమింగ్ తేదీ ప్రకటన సందర్భంగా ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ హెడ్ నిఖిల్మాధోక్ మాట్లాడుతూ.. ప్రతీకారం, భావోద్వేగాలు, అనూహ్య మలుపులునిండిన ఈ సిరీస్ ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా నటించారని, బీహెచ్ డైరెక్షన్‌లో ఈ సిరీస్ అద్భుతంగా తెరకెక్కిందన్నారు.
నిర్మాతలు రాహుల్ తమడా, సందీప్ రెడ్డి బొర్రా మాట్లాడుతూ.. ఇది ఒక రివెంజ్ థ్రిల్లర్ మాత్రమే కాదని, వ్యక్తిగత నష్టం, విశ్వాసం, కుటుంబ విభేదాలు, రాజకీయ ఆధిపత్య పోరాటం వంటి అంశాలను భావోద్వేగంగా మిళితం చేసిన కథ అని అన్నారు. ఈ కథను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ప్రైమ్ వీడియోతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళ, హిందీ బాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూడు బాషలే కాకుండా ఇంగ్లీష్‌తో పాటు 15 బాషల్లో సబ్‌టైటిల్స్‌తో ప్రేక్షకులకు అందుబాటులో రానుంది.
