×
Ad

Aishwarya Rajesh: నైటీలో చూడాలని అన్నాడు.. అలా ఎంత మందిని.. ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్

తన లైఫ్ లో చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh).

Aishwarya Rajesh shocking comments about casting couch in her life.

  • తన లైఫ్ లో చేదు అనుభవాలను గుర్తు చేసుకున్న ఐశ్వర్య రాజేష్.
  • ఒక దర్శకుడు నైటీలో చూడాలని అన్నాడట
  • వైరల్ అవుతున్న ఐశ్వర్య రాజేష్ కామెంట్స్

Aishwarya Rajesh: తెలుగు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు ఐశ్వర్య రాజేష్. చాలా తమిళ సినిమాలతో ఆమె తెలుగునాట సుపతిచితురాలిగా మారిపోయింది. రీసెంట్ గా ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో భాగ్యం పాత్రలో గడుసు పెళ్ళాంగా అదరగొట్టేసింది ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh).

Prabhas: ఇదెక్కడి ట్విస్ట్.. మారుతీకి మరో ఛాన్స్.. షాక్ లో ప్రభాస్ ఫ్యాన్స్

అయితే, ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించినా టాలీవుడ్ నుంచి ఎలాంటి ఆఫర్స్ అందుకోలేదు ఈ అమ్మడు. ఇదిలా ఉంటే, తాజాగా ఐశ్వర్య రాజేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. దీనికి సంబందించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో ఆమె మట్లాడుతూ.. నా కెరీర్ స్టార్టింగ్ లో నేను ఒక సినిమా ఆడియన్స్ కి వెళ్లాను. ఆ డైరెక్టర్ నన్ను నైట్ డ్రెస్సులో కనిపించు అన్నాడు. ఎందుకంటే, అతను నా బాడీ చుడాలని అన్నాడు. ఆ సమయంలో నాకు చాలా కోపం వచ్చింది. ఇలా ఎంతమందిని అడిగి ఉంటాడు అని తరువాత అనుకున్నాను. చాలా బాధేసింది’ అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేష్. అయితే, తనను అలా అడిగిన దర్శకుడు ఎవరు అనేది మాత్రం రివీల్ చేయలేదు. అలాగే ఇంకా ఈ ఇంటర్వ్యూలో తన తండ్రి, కెరీర్, ఫ్యామిలీ విషయాలు చాలానే చెప్పింది ఐశ్వర్య రాజేష్. దీంతో ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.