Ajay Bhupathi : నాగార్జునకు కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్.. నిర్మాతలు ఆ అభిప్రాయం నుంచి బయటకు రావాలి..

సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి నేడు మీడియాతో మాట్లాడారు. (Ajay Bhupathi)

  • Published on- July 29, 2026 / 02:47 PM IST

Ajay Bhupathi

Ajay Bhupathi : ఇటీవల నాగార్జున లెనిన్ సక్సెస్ మీట్ లో సినిమా రిలీజ్ వాయిదాలు పడటం, పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవడం, చివరి నిమిషం వరకు సినిమాలో మార్పులు చేస్తూ ఉండటం లాంటి అంశాలపై మాట్లాడారు. లెనిన్ కి కూడా పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవ్వడం, సినిమా పలు మార్లు వాయిదా పడటంతో ఆయనకు కోపం వచ్చి మాట్లాడారు. ఇండస్ట్రీలో ఉన్న సాంకేతిక నిపుణులు, డైరెక్టర్స్, సంగీత దర్శకులు.. అందరూ సినిమా కాపీ రిలీజ్ కి రెండు వారాల ముందే ఫైనల్ అవుట్ పుట్ ఇచ్చేయాలి అన్నారు. ఒడిస్సి అనే హాలీవుడ్ సినిమా సంవత్సరం క్రితం రిలీజ్ డేట్ ఇచ్చి చెప్పిన డేట్ కి రిలీజ్ చేసారు. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అని ఫైర్ అయ్యారు.

దీంతో నాగార్జున సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బయట సినీ పరిశ్రమలో కూడా ఇదే జరుగుతుండటంతో దీనిపై ఎవరూ మాట్లాడలేదు. తాజాగా డైరెక్టర్ అజయ్ భూపతి దీనిపై స్పందించారు. మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమా జులై 30న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి నేడు మీడియాతో మాట్లాడారు.

Also Read : Ajay Bhupathi : మంగళవారం సినిమాటిక్ యూనివర్స్.. ప్రామిస్ చేస్తున్నా.. పార్ట్ 2 పై అజయ్ భూపతి కామెంట్స్..

ఈ క్రమంలో నాగార్జున వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అందరికి ఉంటుంది సినిమా రిలీజ్ ప్లానింగ్ గా ఉండాలని. కానీ నిర్మాతలు కూడా షూటింగ్ అవ్వగానే రిలీజ్ అనే అభిప్రాయంలో నుంచి బయటకు రావాలి. నాగార్జున సర్ మొన్న ఇంగ్లీష్ సినిమా ఒడిస్సి గురించి చెప్పారు. వాళ్ళ స్టైల్ కి మన స్టైల్ కి కంపేర్ చేయకూడదు. షూటింగ్ అయ్యాక మూడు నెలల్లో ఫస్ట్ కాపీ వస్తుంది అనగా సేఫ్ సైడ్ ఓ 6 నెలలు గ్యాప్ తీసుకొని షూటింగ్ అయిన 9 నెలలకు రిలీజ్ డేట్ ఇస్తారు వాళ్ళు. కానీ మన దగ్గర అలా జరగదు కదా.

మంగళవారం సినిమాకు నిర్మాత నేనే. దానికి అలాగే చేశాను. నేను ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ చేశాను. నవంబర్ లో డేట్ వేసుకున్నా. చెప్పిన డేట్ కి రిలీజ్ చేసాను. కానీ చాలా మంది నిర్మాతలు అందుకు ఒప్పుకోరు. వాళ్ళ ఫైనాన్షియల్ సమస్యలు వాళ్లకు ఉంటాయి. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కి టైం ఇస్తే మంచి అవుట్ పుట్ వస్తుంది. ఫస్ట్ కాపీ ఇంకో నెల రోజుల్లో వస్తుంది అంటే మూడు నెలల తర్వాత డేట్ ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. అప్పుడు ప్రమోషన్స్ కి కూడా సమయం ఉంటుంది అని అన్నారు. దీంతో ఈయన చెప్పిన విషయం కూడా నిజమే కదా అని చర్చించుకుంటున్నారు.

Also Read : ఇండస్ట్రీకి క్లాస్ పీకిన నాగార్జున.. నా తప్పు కూడా ఉంది.. కింగ్ కామెంట్స్ వైరల్.. ఇకనైనా మారుతారా?