Nagarjuna : ఇండస్ట్రీకి క్లాస్ పీకిన నాగార్జున.. నా తప్పు కూడా ఉంది.. కింగ్ కామెంట్స్ వైరల్.. ఇకనైనా మారుతారా?
నాగార్జునకు కోపం వచ్చి వీటన్నింటిపై ఇవాళ స్టేజిపై మాట్లాడినట్టు తెలుస్తుంది. (Nagarjuna)
Nagarjuna
Nagarjuna : నేడు అఖిల్ లెనిన్ సక్సెస్ మీట్ జరిగింది. ఈ ఈవెంట్ కి నాగార్జున, నాగచైతన్య కూడా హాజరయ్యారు. ఇటీవల పలువురు సీనియర్ హీరోలు, దర్శకులు, నిర్మాతల్లో ఇండస్ట్రీలో జరిగే తప్పులను స్టేజిపైనే చెప్తున్నారు. ఇప్పటికే పలుమార్లు చిరంజీవి స్టేజిపైనే క్లాస్ పీకగా తాజాగా నాగార్జున క్లాస్ పీకారు.
ఇటీవల అనేక సినిమాలకు చివరి నిమిషం వరకు వర్క్ చేస్తూనే ఉంటున్నారు. రేపు రిలీజ్ అంటే ఇవాళ ఫైనల్ మిక్సింగ్ కూడా చేస్తున్నారు. ఓవర్సీస్ కాపీ పంపిన తర్వాత కూడా ఛేంజెస్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేసి చెప్పిన డేట్ కి రాకుండా వాయిదా వేస్తున్నారు. ముఖ్యంగా ఎడిటింగ్, మ్యూజిక్ దగ్గర బాగా లేట్ అవుతుంది. వీటివల్ల ఫైనల్ అవుట్ పుట్ దెబ్బ తింటుంది. సినిమా బడ్జెట్ కూడా పెరుగుతుంది. సినిమాలో రీ రికార్డింగ్, డబ్బింగ్ సింక్ విషయంలో సమస్యలు వస్తున్నాయి. అఖిల్ సినిమాకు కూడా ఇలాగే జరిగింది. చెప్పిన డేట్ కి సినిమా రెడీ అవ్వకపోవడంతో సినిమాని రెండు వారాలు వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో నాగార్జునకు కోపం వచ్చి వీటన్నింటిపై ఇవాళ స్టేజిపై మాట్లాడినట్టు తెలుస్తుంది.
నాగార్జున మాట్లాడుతూ.. ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ చెకింగ్ టైంకి రెండు వారాల ముందు కాపీ ఇవ్వమని అడిగారు కానీ ఇవ్వలేకపోయాము. ఇస్తే ఇంకా బాగా అవుట్ పుట్ వచ్చేది. నేను ఇండస్ట్రీలో అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా సాంకేతిక నిపుణులు, డైరెక్టర్స్, సంగీత దర్శకులు.. అందరూ మీరు ఏ సినిమాని అయినా ఒక రెండు వారాల ముందే ఫైనల్ కాపీ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ కి ఇస్తే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. ఈ సినిమాకు చివరి నిమిషంలో నేను, డైరెక్టర్, ఎడిటర్ కూడా కూర్చొని కరెక్షన్స్ చేస్తూ ఉన్నాము. ఒక్కరం కాదు, నాతో సహా అందరూ కలిసి రెండు వారాల క్రితం ఇస్తే సినిమాని ఇంకా పైకి తీసుకెళ్లొచ్చు.
ఇటీవల రిలీజ్ అయిన ఒడిస్సి అనే హాలీవుడ్ సినిమా సంవత్సరం క్రితం రిలీజ్ డేట్ ఇచ్చి చెప్పిన డేట్ కి రిలీజ్ చేసారు. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం. రిలీజ్ డేట్ ఇచ్చినా ఎందుకు వాయిదా వేస్తున్నాం. నేను కూడా రిలీజ్ డేట్ ఇచ్చాను కానీ వాయిదా వేసాను. జూన్ 26 రిలీజ్ అవ్వాలి. కానీ సాంకేతికంగా సినిమా అవ్వలేదు. బెటర్ క్వాలిటీ రావాలి అందుకే వాయిదా వేసాము. అందరికి చెప్తున్నా ఇది రిక్వెస్ట్, నాతో సహా ఒకప్పుడు నెల రోజుల క్రితమే రిలీజ్ కాపీ రెడీ అయ్యేది. ఇప్పుడు ఎందుకు చెయ్యలేకపోతున్నారు. వంశీ(నిర్మాత నాగవంశీ) నీక్కూడా చెప్తున్నా. ఇది ఆలోచించి సినిమా కాపీని ముందే రెడీ చేస్తే అందరికి బాగుంటుంది అంటూ ఫైర్ అయ్యారు.
దీంతో కింగ్ నాగార్జున వ్యాఖ్యలు టాలీవుడ్ లో వైరల్ గా మారాయి. మరి ఇప్పటికైనా టాలీవుడ్ సాంకేతిక నిపుణులు, మ్యూజిక్ డైరెక్టర్స్, ఎడిటర్స్, డైరెక్టర్స్.. చివరి నిమిషం వరకు సినిమాని చిక్కకుండా ప్లానింగ్ తో సినిమా రిలీజ్ కి కనీసం రెండు వారాల ముందే ఫైనల్ అవుట్ పుట్ రెడీ చేస్తారా చూడాలి. నాగార్జున వ్యాఖ్యలపై టాలీవుడ్ లో ఎవరైనా స్పందిస్తారా చూడాలి.
