Ajay Bhupathi : అదితి – సిద్దార్థ్ క్లోజ్ ఫొటో షేర్ చేసి.. దీనికి నేనే కారణం అనుకుంటున్నారు అంటూ పోస్ట్ చేసిన డైరెక్టర్..

హీరో సిద్దార్థ్(Siddharth), హీరోయిన్ అదితిరావు హైదరి(Aditi Rao Hydari) గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు, డేటింగ్ లో ఉన్నారు అని వార్తలు వస్తూనే ఉన్నాయి.

  • Published On : October 29, 2023 / 12:46 PM IST

Ajay Bhupathi Questioning on Aditi Rao Hydari and Siddharth Love

Ajay Bhupathi : హీరో సిద్దార్థ్(Siddharth), హీరోయిన్ అదితిరావు హైదరి(Aditi Rao Hydari) గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు, డేటింగ్ లో ఉన్నారు అని వార్తలు వస్తూనే ఉన్నాయి. ముంబై(Mumbai) వీధుల్లో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు, కలిసి డిన్నర్స్, లంచ్, పార్టీలకు వెళ్తూనే ఉన్నారు. సినిమా ఈవెంట్స్ కి కలిసే వెళ్తున్నారు. కలిసి రీల్స్ కూడా చేస్తున్నారు. సిద్దార్థ్ అయితే అదితి వాళ్ళ చుట్టాలింటికి కూడా వెళ్ళాడు తనతో కలిసి.

ఇక అందరికి తెలిసిపోయిందేమో అని ఈ మధ్య ఇద్దరూ కలిసి ఓపెన్ గానే తిరిగేస్తున్నారు. ఇటీవల సిద్దార్థ చిన్నా సినిమా బాలీవుడ్ ప్రీమియర్ కి అదితి దగ్గరుండి అన్ని చూసుకుంది. తాజాగా నిన్న అక్టోబర్ 28న అదితి రావు హైదరీ పుట్టినరోజు కావడంతో అదితి, సిద్దార్థ్ క్లోజ్ గా దిగిన ఫోటోని షేర్ చేసి సిద్దార్థ్ స్పెషల్ గా బర్త్ డే విషెస్ పోస్ట్ చేశాడు.

Also Read : MLC Kavitha : చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్ అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్.. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ గురించి కూడా..

అయితే ఇదే ఫోటోని డైరెక్టర్ అజయ్ భూపతి(Ajay Bhupathi) తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. అందరూ దీనికి నేనే కారణం అనుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అని పోస్ట్ చేసి సిద్దార్థ్, అదితిలను ట్యాగ్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అయింది. డైరెక్టర్ అజయ్ భూపతి మహా సముద్రం(Maha Samudram) సినిమాలో అదితి, సిద్దార్థ్ కలిసి నటించారు. అంతకుముందు నుంచే వీరికి పరిచయం ఉన్నా ఈ సినిమా తర్వాత క్లోజ్ గా మారారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో పడటానికి కారణం అజయ్ భూపతినే అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ జంట పెళ్లి చేసుకుంటుందా లేక ఇలాగే డేటింగ్ చేస్తూ ఇంకెన్నాళ్లు గడుపుతారో చూడాలి.