MLC Kavitha : చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్ అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్.. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ గురించి కూడా..

తాజాగా బీఆర్ఎస్(BRS) నేత, ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ లో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అభిమానులు, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది కవిత.

MLC Kavitha : చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్ అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్.. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ గురించి కూడా..

MLC Kavitha Interesting Comments on Chiranjeevi and Allu Arjun

Updated On : October 29, 2023 / 12:08 PM IST

MLC Kavitha : తెలంగాణలో(Telangana) ఎన్నికల సందడి మొదలైన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ పార్టీలు, నాయకులు తమ తమ పద్దతిలో ప్రచారాలు చేస్తున్నారు. యువత ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో వారిని టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో కూడా తెగ ప్రచారాలు చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్(BRS) నేత, ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ లో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది.

ఈ నేపథ్యంలో అభిమానులు, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది కవిత. ఓ నెటిజన్ చిరంజీవి(Chiranjeevi), కవిత ఉన్న ఫొటో షేర్ చేసి చిరంజీవి అభిమానిగా ఆయన గురించి చెప్పండి అని అడగగా.. చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్ అని సమాధానమిచ్చింది. అలాగే మీ ఫేవరేట్ హీరో ఎవరు అని ఓ నెటిజన్ అడగగా.. చిరంజీవి ఆల్వేస్, నెక్స్ట్ అల్లు అర్జున్(Allu Arjun).. తగ్గేదేలే అని రిప్లై ఇచ్చింది.

Also Read : Vishwak Sen : విశ్వక్‌సేన్ సంచలన ట్వీట్.. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు.. సినిమా రిలీజ్ అవ్వకపోతే ప్రమోషన్స్‌కి రాను..

దీంతో చిరంజీవి, అల్లు అర్జున్ గురించి కవిత ఇచ్చిన సమాధానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.