Ajay Bhupathi : హీరోగా మహేష్ అన్న తనయుడి ఎంట్రీ.. ఫస్ట్ సినిమానే ఫ్లాప్.. స్పందించిన దర్శకుడు..
ఇటీవల జులై 30న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయింది. (Ajay Bhupathi)
- Saketh U
- Published on- August 9, 2026 / 05:26 PM IST
Ajay Bhupathi
Ajay Bhupathi : సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు జైకృష్ణ ఘట్టమనేని ఇటీవల హీరోగా పరిచయమవుతూ ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడాని హీరోయిన్ గా నటించింది. వైజయంతి మూవీస్ లాంటి పెద్ద బ్యానర్ సమర్పణలో కిరణ్ నిర్మాణంలో RX100, మంగళవారం లాంటి హిట్ సినిమాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఇటీవల జులై 30న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయింది. మహేష్ అన్న కొడుకు హీరోగా వస్తుండటం, మహేష్ కూడా ఈ సినిమాకు సపోర్ట్ గా ట్వీట్స్, వీడియోలు చేయడం, మంగళవారం డైరెక్టర్ కావడం, మోహన్ బాబు చాన్నాళ్ల తర్వాత పవర్ ఫుల్ లుక్ లో కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. కానీ ఆ అంచనాలను సినిమా తలకిందులు చేస్తూ ఫ్లాప్ అయింది. రొటీన్ పాత లవ్ స్టోరీ, పాత కథనం, క్వాలిటీ లేని సినిమాటోగ్రాఫ్ విజువల్స్ తో కమర్షియల్ సినిమాగా తెరకెక్కింది. దీంతో ఈ సినిమాని ప్రేక్షకులు తిరస్కరించారు.
Also Read : Nagababu : అయిదేళ్లుగా నా కొడుకు బాధను మోస్తున్నాడు.. వరుణ్ తేజ్ పై నాగబాబు ఎమోషనల్ పోస్ట్..
ఈ సినిమా హిట్ అయింది అని మూవీ యూనిట్ కూడా హంగామా చేయలేదు. అయితే తాజాగా దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమా ఫలితంపై స్పందిస్తూ ట్వీట్ చేసాడు.
అజయ్ భూపతి తన ట్వీట్ లో.. శ్రీనివాస మంగాపురం నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇది నాకు ఎన్నో భావోద్వేగాలను, మధురమైన జ్ఞాపకాలను అందించింది. వాటిని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. జై కృష్ణ, రషా తడానిలతో పనిచేస్తున్నప్పుడు వారు కొత్తవారనే భావన అస్సలు కలగలేదు. వాళ్ళు తమ అత్యుత్తమ నటనను ప్రదర్శించారు. అశ్విని దత్ గారితో కలిసి పనిచేయడం కూడా నాకు దక్కిన గొప్ప గౌరవం. అలాగే కిరణ్ గారికి కూడా ధన్యవాదాలు. ఈ సినిమా ఫలితానికి సంబంధించిన పూర్తి బాధ్యతను నేనే తీసుకుంటున్నాను. త్వరలోనే నేను మళ్లీ పుంజుకుని, మీ అందరికీ నచ్చే చిత్రంతో మీ ముందుకు వస్తాను. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, చిత్ర బృందం, సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు అని తెలిపారు.
దీంతో ఈ సినిమా ఫ్లాప్ అయిందని ఒప్పుకుంటూ, దానికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటాను అని డైరెక్టర్ పోస్ట్ చేయడంతో ఈ ట్వీట్ కాస్త చర్చగా మారింది. ప్రస్తుతం అజయ్ భూపతి మంగళవారం సీక్వెల్ పనుల్లో ఉన్నట్టు సమాచారం.
#SrinivasaMangapuram is a very special film for me. It has given me so many emotions and memories that I will always cherish.
Working with #JayaKrishna & #Rasha never felt like working with newcomers… they gave their best. Working with #AshwiniDutt Garu was also a great…
— Ajay Bhupathi (@DirAjayBhupathi) August 8, 2026
Also See : Tara Sutaria : బాబోయ్.. టాక్సిక్ ఈవెంట్ కోసం అందాలు ఆరబోస్తూ తరలివచ్చిన తార సుతారియా..
