Ajay Devgn: మార్చి 6న ఖైదీ రీమేక్ ట్రైలర్ లాంచ్

బాలీవుడ్‌లో దక్షిణాది చిత్రాలను ఎక్కువగా రీమేక్ చేసే హీరోగా అజయ్ దేవ్గన్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘భోలా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ మూవీ ‘ఖైదీ’కి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. తమిళంలో కార్తీ హీరోగా నటించిన ఖైదీ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను హిందీ జనాలకు ‘భోలా’ అంటూ తీసుకొస్తున్నాడు అజయ్ దేవ్గన్.

Ajay Devgn: బాలీవుడ్‌లో దక్షిణాది చిత్రాలను ఎక్కువగా రీమేక్ చేసే హీరోగా అజయ్ దేవ్గన్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘భోలా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ మూవీ ‘ఖైదీ’కి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. తమిళంలో కార్తీ హీరోగా నటించిన ఖైదీ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను హిందీ జనాలకు ‘భోలా’ అంటూ తీసుకొస్తున్నాడు అజయ్ దేవ్గన్.

Ajay Devgn Bholaa : అజయ్ దేవగన్ ‘ఖైదీ’ రీమేక్‌లో.. విలన్‌గా జూనియర్ బచ్చన్..

ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 6న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ సినిమాను అజయ్ దేవ్గన్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ కూడా ఉండబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Ajay Devgn : రీమేక్స్ తోనే స్టార్ అయి.. అవే రీమేక్స్‌తో కెరీర్‌ని నెట్టుకొస్తున్న స్టార్ హీరో..

భోలా సినిమాలో టబు, అమలా పాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరి భోలా చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు