Ajay Devgn : రీమేక్స్ తోనే స్టార్ అయి.. అవే రీమేక్స్‌తో కెరీర్‌ని నెట్టుకొస్తున్న స్టార్ హీరో..

రీమేక్స్ తోనే తన స్టార్ డమ్ ను పెంచుకొన్న హీరో అజయ్ దేవగణ్. బాలీవుడ్ క్రైసిస్ లో పడిన ఈ టైమ్ లో కూడా ఆయన రీమేక్స్ ను వదిలిపెట్టడం లేదు. బాలీవుడ్ లో రీమేక్స్ ఎక్కువగా చేసే హీరోల్లో అజయ్ దేవగణ్ ఒకరు.............

Ajay Devgn : రీమేక్స్ తోనే స్టార్ అయి.. అవే రీమేక్స్‌తో కెరీర్‌ని నెట్టుకొస్తున్న స్టార్ హీరో..

Ajay Devgan continues to remake movies

Ajay Devgn :  కొందరు హీరోల కెరీర్ గ్రాఫ్ ను అమాంతం పెంచేవి రీమేక్సే. వాటితోనే తన స్టార్ డమ్ ను పెంచుకొన్న హీరో అజయ్ దేవగణ్. బాలీవుడ్ క్రైసిస్ లో పడిన ఈ టైమ్ లో కూడా ఆయన రీమేక్స్ ను వదిలిపెట్టడం లేదు. బాలీవుడ్ లో రీమేక్స్ ఎక్కువగా చేసే హీరోల్లో అజయ్ దేవగణ్ ఒకరు.

అజయ్ దేవగణ్ ఎంట్రీ మూవీ ‘ఫూల్ ఔర్ కాంటే’నే ఓ సూపర్ హిట్ మలయాళ మూవీకి రీమేక్ వెర్షన్. నెక్స్ట్ మూవీ ‘జిగర్’ సైతం ఓ హాలీవుడ్ మూవీకి ప్రేరణగా తీసుకున్నది. ఆయనకి స్టార్ డమ్ తెప్పించిన వాటిలో రీమేక్స్ కు కాస్తంత ఎక్కువగానే క్రెడిట్ ఉంటుంది. ఇతర భాషల నుంచి రీమేక్ చేసిన సినిమాలతో పాటు ఒకప్పటి బాలీవుడ్ మూవీస్ ను కూడా అజయ్ ఎక్కువగానే మళ్ళీ రీమేక్ చేయడం విశేషం.

కెరీర్ బిగినింగ్ లో ఓన్లీ లవ్ స్టోరీస్ పైనే ఎక్కువ ఫోకస్ చేసిన అజయ్ దేవగణ్ కొంతకాలం కామెడీ మూవీస్ పై ఫోకస్ పెట్టారు. ఆ జోనర్ లో కూడా పలు సినిమాలు సక్సెస్ అయ్యాయి. వాటిల్లో కూడా రీమేక్సే ఉండటం విశేషం. అజయ్ ను స్టార్ హీరోగా నిలబెట్టినవి మాత్రం యాక్షన్ సినిమాలే. వీటిలో కూడా పలు రీమేక్ సినిమాలు ఉన్నాయి.

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల పరిస్థితులు బాగోలేదు. ఈ టైమ్ లో బాలీవుడ్ కు మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో అజయ్ దేవగణ్ ఎక్కువగా మళ్ళీ రీమేక్ మూవీస్ నే నమ్ముకుంటున్నాడు. అజయ్ దేవగణ్ లేటెస్ట్ మూవీ ‘దృశ్యం 2’ రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చింది. దీనికి రెస్పాన్స్ మామూలుగా లేదు. మలయాళ రీమేక్ అయినప్పటికీ నేటివిటీని ఎక్కడా మిస్ చేయకుండా పార్ట్ 1తో ఎలాంటి అనుభూతినిచ్చారో సెకండ్ పార్ట్ తోనూ జనాన్ని అంతే థ్రిల్ చేశాడు డైరెక్టర్. ఈ సినిమా సూపర్ సక్సెస్ తో బాలీవుడ్ తిరిగి కళకళలాడుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ జనం తిరిగి థియేటర్స్ కు రావడం శుభపరిణామం.

అజయ్ దేవ్ గణ్ అప్ కమింగ్ మూవీ ‘భోళా’. కార్తీ నటించిన సూపర్ హిట్ తమిళ మూవీ ‘ఖైదీ’కి అఫీషియల్ రీమేక్. పెరోల్ పై విడుదలైన ఒక ఖైదీ తన కూతురు కోసం కష్టాల్లో ఉన్న పోలీసుల్ని ఎలా ఆదుకున్నాడు అన్నదే కథాంశం. ఇందులో కార్తీ ఢిల్లీ అనే పాత్రను పోషించాడు. అదే పాత్రను అజయ్ దేవగణ్ భోళాగా చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక అజయ్ చేస్తున్న మరో రీమేక్ మూవీ అల్లరి నరేశ్ నటించిన సూపర్ హిట్ సినిమా నాంది. విజయ్ కనకమేడల డైరెక్షన్ లో అల్లరి నరేశ్ నటించిన ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్టైంది. చేయని హత్యకేసుతో జైలుపాలైన ఒక యువకుడు రాజకీయ వ్యవస్థతో ఎలా పోరాడాడు అన్నదే సినిమా కథాంశం. అల్లరి నరేశ్ పాత్రను హిందీలో అజయ్ దేవగణ్ చేయబోతున్నట్టు సమాచారం. కథలో కొన్ని మార్పులు చేసి సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి ప్రొడ్యూసర్ దిల్ రాజు కావడం విశేషం.

Rishab Vs Rashmika : రిషబ్ వర్సెస్ రష్మిక.. అసలు ఈ గొడవేంటి??

ధనుష్ నటించిన సూపర్ హిట్ తమిళ మూవీ ‘అసురన్’. వెట్రిమారన్ డైరెక్షన్ రూపొందిన ఈ సినిమాను తెలుగులో వెంకటేశ్ తో ‘నారప్ప’గా రీమేక్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్టే. అయితే ఇదే సినిమాను హిందీలో అజయ్ దేవగణ్ తో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది కూడా ఓకే అయితే అజయ్ ఖాతాలో మరో రీమేక్ హిట్ చేరినట్టే. ఇలా రీమేక్స్ తోనే హిట్స్ కొట్టి స్టార్ హీరో అయి ఇప్పుడు కూడా రీమేక్ సినిమాలనే నమ్ముకుంటూ నెట్టుకొస్తున్నారు ఈ బాలీవుడ్ స్టార్ హీరో. అజయ్ దేవగణ్ చేసే సినిమాల్లో ఎక్కువగా సౌత్ రీమేక్స్ ఉండటం విశేషం.