Maidaan : రిలీజ్ డేట్ మళ్లీ మారింది..
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ నటిస్తున్నస్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ ‘మైదాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు..
- sekhar
- Published On : September 30, 2021 / 12:28 PM IST
Maidaan
Maidaan: ప్రపంచంలో అత్యధిక మంది ఆదరించే ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో యధార్థ కథ ఆధారంగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మైదాన్’. భారత దేశాన్ని ఫుట్ బాల్ రంగంలో ప్రపంచ పటంలో నిలిపిన కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీద్ జీవిత కథ ఆధారంగా ‘మైదాన్’ తెరకెక్కుతోంది.
Love Story : ఆ ముద్దు సీన్లు ఎలా చేశామంటే..
జీవితంలో అయినా, ఆటలోనైనా ఆత్మ విశ్వాసం, కష్టపడే తత్వంతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తేనే విజయం వరిస్తుంది. క్రీడా నేపథ్యంలో స్ఫూర్తివంతమైన కథగా ‘మైదాన్’ ను నిర్మిస్తున్నారు. ప్రియమణి, గజరాజ్ రావ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ‘బధాయి హో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
Republic : నాని ‘రిపబ్లిక్’ రివ్యూ చెప్పేసాడుగా..
పాండమిక్ కారణంగా సినిమా విడుదల పలుసార్లు వాయిదా పడుతూ వస్తుంది. గురువారం న్యూ రిలీజ్ డేట్‌ను మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. 2022 జూన్ 3న ‘మైదాన్’ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో భారీగా స్థాయిలో విడుదల చెయ్యబోతున్నారు.
Maidaan, A story that will resonate with every Indian, a film that I feel very strongly about. Mark the date on your calendar. Releasing worldwide on 3rd June, 2022. pic.twitter.com/bmHM2sf8qm
— Ajay Devgn (@ajaydevgn) September 30, 2021
