CM Pellam : పొలిటికల్ పాయింట్స్‌తో.. ‘సీఎం పెళ్ళాం’ మూవీ.. హోమ్ మినిస్టర్‌గా సురేష్ కొండేటి..
పొలిటికల్ పాయింట్స్‌తో 'సీఎం పెళ్ళాం' అనే మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో..
- gum 95921
- Published On : October 16, 2023 / 07:42 PM IST
Ajay Indraja Suresh Kondeti new movie titled as CM Pellam
CM Pellam : డిఫరెంట్ యాంగిల్ లో పొలిటికల్ పాయింట్స్, నిజంగా ఒక పదేళ్ళ తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయి? ఎలా ఉండబోతున్నాయి? అనేది భిన్నమైన కోణంలో ఒక కొత్త ప్రయత్నంతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న సినిమా ‘సీఎం పెళ్ళాం’. రమణారెడ్డి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాకి ‘కామన్ మ్యాన్ పెళ్ళాం’ అనే ట్యాగ్ లైన్ ని పెట్టారు. టాలీవుడ్ నటుడు అజయ్, ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ ప్రధాన పాత్రల్లో రూపొందబోతున్న ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో సోమవారం స్టార్ట్ అయ్యింది.
ఈ సినిమాలో సీఎంగా అజయ్, సీఎం పెళ్లాంగా ఇంద్రజ, హోమ్ మినిస్టర్ గా సురేష్ కొండేటి నటిస్తున్నారు. ఇక సీనియర్ హీరో సుమన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నగేష్, కోటేశ్వర రావు, భరత్, ప్రీతి నిగం, రూపాలక్ష్మి, ప్రజ్ఞ, శాంతి, దాసరి చలపతి రావు, బేబీ హర్షిత, సత్యనారాయణ మూర్తి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈరోజు మొదలైన ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు జరగనుందని మేకర్స్ తెలియజేశారు. వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారని వెల్లడించారు.
ఇక ఇంద్రజ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. “సొసైటీకి చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ ఉన్న ఒక మూవీ ఇది. సోల్ ఫుల్ గా తీయాలని ప్రయత్నిస్తాం. త్వరలోనే మీ ముందుకు వస్తాం, ఇంతకు ముందు లానే మమ్మలని ఆదరించండి” అంటూ వ్యాఖ్యానించింది. వాకాడ అప్పారావు సమర్పణలో ఆర్కే సినిమాస్ బేనర్ పై బొల్లా రామకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రిన్స్ హనీ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. త్వరలో ఈ మూవీకి సంబంధించిన మరికొన్ని వివరాలను తెలియజేయనున్నారు.
