Ajith Fans : హీరోకే ఇంట్రెస్ట్ లేదు.. కానీ రాజకీయ పార్టీ పెట్టిన ఫ్యాన్స్.. విజయ్ పై కోపంతో.. తమిళనాట సంచలనం..

ఎన్నో ఏళ్లుగా తమిళనాడులో విజయ్ - అజిత్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

  • Published on- September 21, 2026 / 09:23 AM IST

Ajith Fans

Ajith Fans : ఇటీవల కాలంలో చాలా మంది స్టార్ హీరోల అభిమానులు తమ హీరోలను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్ రెండు చోట్ల ఈ పరిస్థితి నెలకొంది. తమిళనాడులో విజయ్ ఇటీవల తమిళ వెట్రి కజగం అనే పార్టీ పెట్టి మొదటిసారి పోటీ చేసి తమిళనాడు సీఎం అయిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడులో వేరే హీరోల ఫ్యాన్స్ కాస్త జెలస్ ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా అజిత్ ఫ్యాన్స్.

ఎన్నో ఏళ్లుగా తమిళనాడులో విజయ్ – అజిత్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. విజయ్, అజిత్ కలిసి కనిపించినా వాళ్ళ మధ్య ఏ గొడవలు లేవని సంకేతాలు ఇచ్చినా ఫ్యాన్స్ మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని కొట్టుకుంటూనే ఉన్నారు. ఇటీవల విజయ్ సీఎం అయ్యాక అజిత్ కార్ రేసింగ్ లో పాల్గొంటే అక్కడికి వెళ్లి కలిసి అభినందించారు. మరోసారి వీరి స్నేహం అందరికి తెలిసింది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఒప్పుకోవట్లేదు.

Also See : Pallavi Gowda : సీరియల్ నటి పల్లవి గౌడ పుట్టిన రోజు వేడుకలు.. ఫొటోలు..

విజయ్ అజిత్ ని కలిసిన కొన్ని రోజులకే అజిత్ ఫ్యాన్స్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తమిళగ మక్కల్‌ కళగం (తమిళనాడు పీపుల్స్‌ పా­ర్టీ) అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఆది­వారం నాడు అజిత్ ఫ్యాన్స్ ప్రకటించారు. తమిళనాడు కల్లకురిచి జిల్లాలోని ఉలందూరుపేటలో ఈ పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. పార్టీలో పదవులు కూడా డిసైడ్ చేసారు. పా­ర్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆబిత్, రాష్ట్ర కార్యదర్శిగా రామ్‌కుమార్, కోశాధికారిగా మహమ్మద్‌ షా నియామకం అయి రా­ష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని అజిత్ కోసం ఖాళీగా ఉంచారు. ఆయన వచ్చి ఆ పదవిని స్వీకరించాలని కోరారు.

ఇక పార్టీ జెండాగా పసుపు, తెలుపు, ఎరుపు మూడు రంగులతో, మధ్యలో రెండు చిరుతపులులతో రూపొందించారు. విజయ్ పార్టీ జెండా పసుపు, ఎరుపు రంగులతో మధ్యలో రెండు ఏనుగులు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అజిత్ ఫ్యాన్స్ పార్టీ, పార్టీ జెండా ఇప్పుడు తమిళనాట చర్చగా మారాయి. మరి దీనిపై అజిత్ స్పందిస్తాడా లేదా చూడాలి. అసలు అజిత్ కి అయితే రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు. సినిమాలు కూడా ఇంట్రెస్ట్ లేదు కానీ అభిమానుల కోసమే చేస్తున్నాను అని గతంలోనే చెప్పాడు. అజిత్ కార్ రేసింగ్ పైనే ఎక్కువ మక్కువ చూపిస్తూ వివిధ దేశాల్లో జరిగే రేసింగ్స్ లో పాలోంతున్నాడు. అజిత్ కి అధికారిక కార్ రేసర్ లైసెన్స్ ఉంది. మన దేశం తరపున అధికారికంగా పలు పోటీల్లో పాల్గొని విజయం కూడా సాధించారు. కేవలం అజిత్ ఫ్యాన్స్ విజయ్ సీఎం అయ్యాడు అనే జెలసీ, కోపం తోనే ఈ పార్టీ పెట్టి హడావిడి చేస్తున్నారని తమిళ మీడియా సమాచారం.

Also Read : Bigg Boss 10 Krishnudu Elimination : కృష్ణుడు ఎలిమినేట్.. డ్యాన్సులతో రెచ్చిపోయిన జంటలు.. బిగ్ బాస్ 10 ‘డే 14’ వీకెండ్ ఎపిసోడ్..