Ajith Kumar : చిరంజీవికి పోటీగా అజిత్ కుమార్ రాబోతున్నాడా.. అలాగే పవన్ కళ్యాణ్..
చిరంజీవికి పోటీగా అజిత్ కుమార్ రాబోతున్నాడా. అదే పోటీలో పవన్ కళ్యాణ్ కూడా..
- gum 95921
- Published On : March 14, 2024 / 08:38 PM IST
Ajith Kumar announce his next movie under mythri movie makers
Ajith Kumar : తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. గత ఏడాది సంక్రాంతికి ‘తెగింపు’ అనే హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. తెలుగులో కూడా రిలీజైన ఆ సినిమా మంచి విజయానే అందుకుంది. ప్రస్తుతం ఈ హీరో మగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విడ ముయిర్చి’ సినిమా చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ హీరో తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో ఓ మూవీ చేయబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. గత ఏడాది హీరో విశాల్ తో ‘మార్క్ ఆంటోనీ’ వంటి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెరకెక్కించి ఆడియన్స్ ఎంటర్టైన్ చేసిన అధిక రవిచంద్రన్.. అజిత్ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. జూన్ నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుందట. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకు రాబోతున్నట్లు ఇప్పుడే ప్రకటించేసారు నిర్మాతలు.
Also read : Vishwak Sen : ట్రోల్స్‌తో విశ్వక్‌ని ఒక ఆట ఆడేసుకున్న నెటిజెన్స్.. విశ్వక్ రియాక్షన్ ట్వీట్..
With Wholesome Humbleness herewith, we Announce the title of AK’s Next Movie Called as #GoodBadUgly #AjithKumar @Adhikravi @ThisIsDSP @AbinandhanR @editorvijay @GoodBadUglyoffl@SureshChandraa @supremesundar#kaloianvodenicharov #Anuvardhan @valentino_suren@Donechannel… pic.twitter.com/EU4qKO5fEO
— Mythri Movie Makers (@MythriOfficial) March 14, 2024
మైత్రి నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా లేదా అనేది ప్రశ్నగా మిగిలింది. ఒకవేళ రిలీజ్ చేస్తే.. వచ్చే ఏడాది సంక్రాంతిలో చిరంజీవి ఆల్రెడీ ‘విశ్వంభర’తో స్లాట్ ఫిక్స్ చేసుకొని ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ కూడా సంక్రాంతికే రాబోతుందని టాక్ వినిపిస్తుంది. మరి ఇద్దరి మెగా బ్రదర్స్ కి అజిత్ తన సినిమాని పోటీగా తీసుకు వస్తారా..? లేదా తమిళంలోనే రిలీజ్ చేస్తారా..? అనేది చూడాలి.
కాగా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. గతంలో పదేళ్ల క్రిందట దేవిశ్రీ ప్రసాద్, అజిత్ సినిమాకి పని చేశారు. 2014లో రిలీజైన ‘వీరం’కి దేవిశ్రీ సూపర్ హిట్ మ్యూజిక్ ని అందించారు. మళ్ళీ ఇప్పుడు ఈ కాంబినేషన్ మ్యూజిక్ లవర్స్ ని అలరించబోతున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు కనిపించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.
