Ajith Kumar : స్టంట్ చేస్తూ యాక్సిడెంట్‌కి గురైన అజిత్.. వైరల్ అవుతున్న వీడియోలు..

‘విడ ముయిర్చి’ సినిమాలోని యాక్షన్ స్టంట్ చేస్తూ యాక్సిడెంట్‌కి గురైన అజిత్. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు..

Ajith Kumar met an accident in VidaaMuyarchi movie sets

Ajith Kumar : తమిళ్ స్టార్ అజిత్ కుమార్ బాడీ డబుల్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయడం కోతేమి కాదు. ఎన్నో సినిమాల్లో అజిత్ రిస్కీ స్టంట్స్ చేసి ప్రమాదానికి గురయ్యారు. ‘వలిమై’ సినిమాలో కూడా రిస్కీ షాట్స్ ఎటువంటి డూప్ లేకుండా అజిత్ చేసి అదుర్స్ అనిపించారు. ప్రస్తుతం ఈ హీరో ‘విడ ముయిర్చి’ సినిమా చేస్తున్నారు. దర్శకుడు మగిజ్ తిరుమేని ప్రెజెంట్ ఈ మూవీలోని కారు యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సీక్వెన్స్ ని కూడా అజిత్ బాడీ డబుల్ లేకుండానే చేస్తున్నారు. కారుని వేగంగా డ్రైవర్ చేస్తున్న సమయంలో అదుపుతప్పి.. కారు బోల్తా పడిపోయింది. ఈ సమయంలో అజిత్ పాటు మరో నటుడు కూడా కారులో ఉన్నాడు. ప్రమాద సమయంలో కారు బాగా డ్యామేజ్ అయ్యినట్లు షూటింగ్ వీడియోలో తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారింది.

Also read : Rashmika Mandanna : రష్మిక మందన్న బర్త్‌డే.. ఫ్యాన్స్‌కి నిరాశే.. ఊరించి ఉసూరుమనిపించిన రాహుల్..

ఇవి చూసిన ఫ్యాన్స్ అజిత్ కి ఏమైనా గాయాలు అయ్యాయా అని కంగారు పడుతున్నారు. అయితే ప్రమాద సమయంలో రికార్డు అయిన వీడియోలో అజిత్ మాట్లాడుతూ.. తాను బాగానే ఉన్నట్లు, ఏం కాలేదు అన్న వాయిస్ రికార్డు అయ్యింది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో కంగారు పడుతూనే ఉన్నారు. ఇక ఈ రిస్కీ షాట్ పై నెటిజెన్స్ రియాక్ట్ అవుతూ.. రియల్ లైఫ్ లో కూడా హీరో అంటూ అజిత్ ని ప్రశంసిస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు