Rashmika Mandanna : రష్మిక మందన్న బర్త్‌డే.. ఫ్యాన్స్‌కి నిరాశే.. ఊరించి ఉసూరుమనిపించిన రాహుల్..

రష్మిక రాబోయే సినిమాల నుంచి పుట్టిన రోజుకు ఏదైనా అప్డేట్స్ వస్తాయేమో అని భావించారు అభిమానులు.

Rashmika Mandanna : రష్మిక మందన్న బర్త్‌డే.. ఫ్యాన్స్‌కి నిరాశే.. ఊరించి ఉసూరుమనిపించిన రాహుల్..

Rahul Ravindran Tweet on Rashmika Mandanna Birthday Movie Updates Fans Disappointed

Updated On : April 4, 2024 / 2:05 PM IST

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. రేపు ఏప్రిల్ 5న రష్మిక పుట్టినరోజు. రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. రష్మిక మాత్రం తన బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోడానికి అమెరికా చెక్కేసింది.

అయితే రష్మిక రాబోయే సినిమాల నుంచి పుట్టిన రోజుకు ఏదైనా అప్డేట్స్ వస్తాయేమో అని భావించారు అభిమానులు. ఈ క్రమంలో రష్మిక మెయిన్ లీడ్ లో చేస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్'(The Girlfriend) సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తామని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెలిపాడు. ఈ టీజర్ కోసం రష్మిక అయిదు భాషల్లో డబ్బింగ్ కూడా చెప్తుందని, పాన్ ఇండియా టీజర్ గా రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి.

Also Read : Aarti Chabria : 41 ఏళ్ళ వయసులో తల్లి కాబోతున్న హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్..

తాజాగా రాహుల్ రష్మిక బర్త్‌డే నాడు ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్ గురించి స్పందిస్తూ.. రష్మిక పుట్టినరోజు ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్ రెడీగా ఉంది. కానీ టీజర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాం. అందుకే ప్రస్తుతానికి టీజర్ లాంచ్ ని వాయిదా వేస్తున్నాము. రష్మిక తన ఫ్యాన్స్ తో కలిపి ఓ ఈవెంట్ ని నిర్వహించి టీజర్ రిలీజ్ చేస్తాము. కొన్ని రోజులు ఓపిక పట్టండి. కొత్త డేట్ ని త్వరలో అనౌన్స్ చేస్తాము. ది గర్ల్‌ఫ్రెండ్ ని మీకు త్వరలో పరిచయం చేస్తాము అని తెలిపాడు.

 

దీంతో ఇన్ని రోజులు రాహుల్ టీజర్ రిలీజ్ చేస్తాను అని చెప్పి బర్త్ డేకి ఒక్క రోజు ముందు టీజర్ రిలీజ్ లేదు అని చెప్పడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే త్వరలోనే ఈవెంట్ పెట్టి మరీ ఫ్యాన్స్ మధ్యలో టీజర్ లాంచ్ చేస్తాను అని చెప్పడంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. రష్మిక ప్రస్తుతం అమెరికాలో ఉంది. అందుకే టీజర్ రెడీగా ఉన్నా, రష్మిక అమెరికా నుంచి వచ్చాకే రిలీజ్ చేద్దామని ఎదురుచూస్తున్నారట.