Aarti Chabria : 41 ఏళ్ళ వయసులో తల్లి కాబోతున్న హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్..

బాలీవుడ్ భామ ఆర్తి చబ్రియా 41 ఏళ్ళ వయసులో తల్లి కాబోతుంది.

Aarti Chabria : 41 ఏళ్ళ వయసులో తల్లి కాబోతున్న హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్..

Actress Aarti Chabria Became Pregnant at the age of 41 Baby Bump Photos goes Viral

Updated On : April 4, 2024 / 12:42 PM IST

Aarti Chabria : బాలీవుడ్ భామ ఆర్తి చబ్రియా 41 ఏళ్ళ వయసులో తల్లి కాబోతుంది. తాజాగా ఆర్తి చబ్రియా బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ముంబై భామ ఆర్తి చబ్రియా బాలీవుడ్ లో లజ్జ, ఆవారా పాగల్ దీవానా, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా, మిలేంగే మిలేంగే.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, గోపి – గోడమీద పిల్లి.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది.

Also Read : Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావు సినిమాల్లోకి రాకముందు ఏ ఉద్యోగం చేసేవారో తెలుసా?

అయితే ఆర్తి చబ్రియా 2019లో ఆస్ట్రేలియాకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ విశారద్ బీడస్సిని వివాహం చేసుకొని ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆర్తి చబ్రియా ఆస్ట్రేలియాలోనే ఉంటూ అప్పుడప్పుడు ముంబై వస్తుంది. రెండు రోజుల క్రితమే ఆర్తి చబ్రియా తన సోషల్ మీడియాలో తాను ప్రగ్నెంట్ అని బేబీ బంప్ తో ఉన్న ఓ వీడియో పోస్ట్ చేసింది. తాజాగా ఇండియాలో ఆర్తి చబ్రియా బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవ్వడంతో పలువురు ప్రముఖులు ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)