Akhanda : రికార్డులు మొదలు.. సరైన మాస్ బొమ్మ పడితే.. బాలయ్యను ఆపడం కష్టం..
ఆ దేశంలో వేగంగా హౌస్‌ఫుల్ అయిన తెలుగు సినిమాగా ‘అఖండ’ రికార్డ్ క్రియేట్ చేసింది..
- sekhar
- Updated on- November 27, 2021 / 08:16 PM IST
Nbk
Akhanda: ‘సింహ’ గర్జనకు సర్వం సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో బాక్సాఫీస్ బరిలో దిగుతున్న బాలయ్య.. ‘అఖండ’ తో మాస్ జాతర ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ – ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ అవైటెడ్ హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Akhanda Trailer Roar : ఇదీ బాలయ్య మాస్ ర్యాంపేజ్!
Akhanda Trailer Roar పేరుతో ట్రైలర్ రిలీజ్ చెయ్యగా బ్రహ్మాండమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. నటసింహా నందమూరి బాలకృష్ణ సరైన మాస్ క్యారెక్టర్, పవర్ఫుల్ డైలాగ్స్ చెబితే ఫ్యాన్స్ అండ్ మాస్ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చెప్పడానికి ‘అఖండ’ ట్రైలర్ రోర్ చిన్న ఎగ్జాంపుల్‌గా నిలిచింది.
ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేసింది టీం. డిసెంబర్ 1 సాయంత్రం నుండి ఓవర్సీస్లో భారీ ఎత్తున్న ప్రీమియర్స్ పడనున్నాయి. ఆన్ లైన్ బుకింగ్స్‌లో ‘అఖండ’ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే ఆస్ట్రేలియాలో బాలయ్య సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే అక్కడ మెల్బోర్న్లోని వరల్డ్స్ లార్జెస్ట్ ఐమాక్స్ స్క్రీన్‌లో స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు.
బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటల వ్యవధిలోనే అవన్నీ క్లోజ్ అయ్యాయి. నవంబర్ 27న హైదరాబాద్ శిల్పకళావేదికలో ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. డిసెంబర్ 2న సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది.
